మార్గాలు

మార్గాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మహేష్ వూటుకూరి

ఎదుటి వారిలోని
నిజాయితీని చులకన చేసినప్పుడు
నీలోని అసమర్థత ఎంతో
బట్ట బయలవుతుంది ..!!

ఎదుటి వాని పనితనం లేదా
నిబద్ధత విశ్వసనీయత విలువల
ప్రాధాన్యతను గుర్తించి
ప్రసంసించినపుడు
నీ సంస్కారం వెలుగు చూస్తుంది.!!

లేని పోని కబుర్లు
బాధ్యత లేని ప్రసంగాలు
పనికరాని కూతలుగా
నీ చంచల స్వభావాన్ని నిలకడలేని
నీ మనసులే (కి)మి తనాన్ని  నీకై నీవు
చెప్పుకోవడమవుతుంది.!!

నిన్ను నీవు గొప్పగా
ప్రకటించుకున్నంత మాత్రాన
గొప్పతన  సుగంధం
నీకు  అంటుకోదు!!

నలుగురిలో
ఆదర్శంగా నిలచి
ఆపద్బాంధవుడిగా కొలిచేలా
నీ నైజం ఉంటే
ఆ గొప్పతనం గుభాళింపులై
నీకు సలాం చేస్తుంది!!

అన్నిట పైచేయి సాధించాలనే
పట్టుదల వుంటే పరవాలేదు కాని
గారడీ మాటలతో బురిడీ కొట్టించేలా
నీ నైజం వుంటే నీకు ఇజం లేదనేది
ఎక్కువ కాలం దాచలేవు.!!

అబద్ధంతో కూడిన ఏ మాటైనా
నీ భవిష్యత్తును మసక బారుస్తుంది!!

ఆత్మ సంతృప్తి  గల  సంతోషం
ఆత్మవిశ్వాసంతోనే పొందగలవు
అందుకు మంచి తనం
మానవత్వ గుణం మాత్రమే మార్గాలు.!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!