వెలుగునీడలు
రచన : పుష్పాంజలి
చదువు మనిషికి మహోన్నత స్దానమునే ప్రసాదిస్తే జ్ఞానం అనే తత్వం నే కూడా బోదిస్తుంది…
చేతి వృత్తిని కొందరు కులవృత్తిగా ఎంచుకుంటారు కొందరు కడుపుకూటి కోసం ఎంచుకుంటారు …. కోటి విద్యలు కుటి కొరకు అన్నట్లు… చదువు ఒక్కసారి కడుపు నింపకున్న చేతివృత్తిని ఎంచుకుని నేర్చకోవడం చాల ప్రయోజనం ఉంటుంది అది కడుపు నింపే అవకాశం ఉంది.
తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే ఒక కుటుంబం మగ్గం చేతివృతిగా ఎంచుకుని జీవించేవారు వారికి ఒక్క కూమారుడు ఒక కూమారై ఆశ, అభినవ్ ఉన్నంతలో ఇద్దరు పిల్లలు చక్కగా పెంచుకున్నరు దంపతులు ప్రక్కనే ఉన్నా పాఠశాలలో చదవించేవారు పిల్లలు పెరుగుతున్నా కొలది కష్టాలు మొదలై అయ్యింది ..వారి చేనేత వృతికి తగిన ధర గిట్టుబాటు లేకపొవడమే కారణం నూలుధరలు పెరగడం పెద్ద కారణం చుట్టుప్రక్కల ఉండే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అభినవ్ ఆశ కు కష్టాలు ఏమి తెలియకుండా పెరిగి పెద్దయ్యారు. కారణం వారికి పొలం ఎదో వ్యాపారం చేసి భార్యబిడ్డలకు చింతా లేకుండా చేసారు అ ఇంటి పెద్దయన ముకుందం గారు కాని విధి వైపరీత్యం వల్ల చుట్టుపక్కల వారికి అప్పులు ఇచ్చిన డబ్బులు పొయింది పొలం పంటలో వర్షలు లేకపొవడమే పసుపు మిర్చి పంటలు నష్ట జరిగింది ఆ ఒత్తిడికి తట్టకోలేకా గుండెపొటు వచ్చింది ముకుందం గారికి.
అభినవ్ పదిహేను సంవత్సరాలు వయస్సు పద్ధతిగా పెరిగినప్పటికి అంతా భాధత్యలు బరువులు తెలియదు కదా ఎక్కడ ఎవరికి ఏమి ఇచ్చారు? ఆ లావాదేవీలు తెలియని వయస్సు నాన్న హస్పటల్ కి తీసుకుని వెళ్ళారు మానసిక ఒత్తడి బిపి హై అయ్యింది. ఆ రాత్రికి కన్నుమూశారు ముకుందం గారు భార్యబిడ్డలకు తీరని దుఃఖాన్ని మిగిల్చినారు. అభినవ్ కుటుంబం భారం మోయడానికి తయారు అయ్యినాడు వాళ్ళ అమ్మ ఎంతో చెప్పారు ఎలాగైనా కొడుకుని చదవించి ఒక ఉన్నాత అధికారిని చేయాలని ఉండేది ముకుందం గారికి అభినవ్ వాళ్ళామ్మ విజయలక్ష్మి నేను నాలుగు ఇంట్లో పనిచేసి మీకు లోటులేకుండా ఉన్నాపొలం అమ్మి కూడా చదవిస్తాను అంటే కూడా అభినవ్ అమ్మా నీకు ఆ కష్టం అవసరం లేదు అమ్మా నేను ఉన్నాను.
అభినవ్ దృడనిర్ణయం తీసుకుని చెల్లాయి ఆశ ని చదవించేలా అని నిర్ణయం చేసుకుని పొలం గురించి చేనేతా రెండంటికి న్యాయం చేయాలని అమ్మ నీ దగ్గర ఏమైనా డబ్బు దాచి పెట్టారా అంటే లేదు ఎదో ఖర్చులకు ఇచ్చింది పొపులా డబ్బాలో దాచాను ..అలాగే ఆ పెద్ద బీరువాలో నాన్నగారు ఉంచి ఉంటారు చూడు.. అలాగే అమ్మ అంటూ వెదకసాగాడు ఆ బీరువాలో కొంత నగదు ఫిక్సడ్ డిపాజిట్లు పేపర్లు దొరికింది అభినవ్ ,ఆశ పేరు మీదా విజయలక్ష్మి పేరు మీదా ఉంది కాని అయన పేరు మీదా ఏమి ఉంచుకోలేదు నాన్న నీవ్వు నీకోసం ఏమి దాచు కోలేదు . మాకోసం అంతా ఉంచి ఏమి ఉలుకు పలుకు లేకుండా పొయోవు నాన్న కన్నీళ్లు కారుస్తూ బాధపడుతు అలాగే కూర్చొని ఉండిపొయోడు అభినవ్..
విజయలక్ష్మి పిలుపుతో తేరుకున్నా అభినవ్ ఏమిటి నాన్న ఏమైంది
ఏమిలేదు అమ్మా నాన్న గుర్తుకి వచ్చి బాధవేసింది .అంతే అమ్మా డబ్బులు ఉన్నాయి. చెల్లాయి పెళ్ళికి ,చదువుకు కష్టపడవలిసిన అవసరం లేదు. ఇకా నా చదువు అంటావా ఎన్నో కలలు వస్తుంటాయి…. మనకు నిద్రలో అది అంతే లే అమ్మా మనం కొండను అద్దంలో చూస్తే చాల చిన్నగా కనబడుతుంది దగ్గరకు వెళ్ళితే కదా ఇది అంతే అనుకో ..
అభినవ్ సొంతా తెలివితేటలతో నాన్న ఉంచిన కొంచెం పైకం బ్యాంకు లోన్ తీసుకుని కొంతమందిని కొత్తగా పనికి కుదుర్చుకుని అటు వ్వవసాయం మెలుకువలతో చేనేత వస్త్రలలో నేయడం కొంచెం మార్పులు చేర్పులతో ప్రారంభించినాడు సమయం అభినవ్ కి అనుకూలంగా ఉండి అన్ని కలసివచ్చింది ఖాళీ సమయంలో బుక్స్ చదవేవాడు అపారమైన జ్ఞానం సంపాదించినాడు..
ఆందరికి తలలోనాలుకలా కలుపుగోలుగా ఉండే అభినవ్ దగ్గరకు వచ్చివారు అందరు, సలహాలు సంప్రదింపులకు చిన్నవయస్సు పెద్దలు సలహాలు తీసుకుని వారు తన దగ్గరకు వచ్చే వారి దగ్గర ఆయ్యో నేను అంతా పెద్దవాన్ని కాదు బాబాయ్ గారు వయస్సు ఎంతా? చదువు ఎంత పెద్ధ చదువులు చదువుకున్నావారు ఒక్కసారి సరిగ్గా ఆలోచన చేయారు నీ ఆలోచన విదానం నీ జ్ఞానం ముందు పనికిరాని వారే మీ నాన్న ఆత్మ పైనుండి సంతోషంగా ఉంటుంది అభినవ్ బాబు అంతా మీ అభిమానం బాబాయ్ గారు…
కాలం ఎవ్వరికోసం వేచి చూడాదు 5 సంవత్సరాలు గడిచింది ఆశ చదువు డ్రీగీ పూర్తి చేసుకుంది అభినవ్ ఆశను పిలిచి చెల్లి పై చదవు ఏమి చదవాలి అని నిర్ణయం చేసుకున్నావు? అన్నయ్య నాన్న నిన్ను IAS,IPS చేయాలి ఆనుకున్నారు ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నా అలాగే చెల్లాయి నీవ్వు ఏమి చదవాలి అనుకుంటే అది చదువు .
చేనేత కార్మికుల కష్టాలు ఆగడము లేదు ఆత్మహత్యలు ఈ విషయమును తన అభిమాన నటుడు నాయకుడు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు వాళ్ళ కష్టాలు తెలియచేసాడు ఆయన వస్తాను మాట ఇచ్చారు అభినవ్ కి ఇచ్చిన మాట ప్రకారం ఆయన వచ్చారు
వారి కష్టాలను అడగి తెలుసుకున్నారు ప్రభుత్వం దృష్టికి చేర్చారు ఆ చేనేతవస్ర్రాలకు ముఖ్యడుగా నిలిచినారు
చేనతా వస్ర్రాలు దరిస్తాను అని మాట ఇచ్చారు ఆయన నిలుపుకున్నారు ఇంకా అభినవ్ ని గొప్పగా చూడసాగారు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా అభినవ్ అంతా ప్రయెజకుడు అయ్యినందుకు ఆ తల్లి హృదయం ఆనంద పరవశం చెందింది అప్పుడు ఆ విజయలక్ష్మి గారు ఇలా అనుకున్నారు…… నా కొడుకు ఆ హిమలయాలు అంతా ఎత్తకు ఎదిగినాడు అనుకొంది చెమర్చిన కళ్ళతో భర్త పొటోకి ఆ కనిపించిన దేవాధిదేవుడుకి నమస్కారం చేసుకొంది.
