లవ్ ప్రపోజల్ అట్ వెడ్డింగ్

(అంశం : మనసులు దాటని ప్రేమ)

లవ్ ప్రపోజల్ అట్ వెడ్డింగ్

రచయిత:: ఎన్. ధనలక్ష్మి

  ఆర్యవర్ధన్  గ్రూప్ అఫ్ కంపెనీ లో మీటింగ్ కోసం స్టాఫ్ అలాగే ఇతర కంపెనీస్,మీడియా వాళ్ళు    ఎదురు చుస్తూ ఉంటారు ..
అప్పుడు ఆ కంపెనీ ఎండీ ఆర్యవర్ధన్ వస్తాడు.. అందరికి  మీటింగ్ కి ఆలస్యంగా  వచ్చినందుకు సారి చెప్పి  స్టార్ట్ చేస్తారు ..తాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ తన వాక్చాతుర్యానికి ముగ్ధులు అయి వింటూ ఉంటారు …
మీడియా వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పుతారు ..చివరలో మీడియా వాళ్ళు ఆర్యన్ మ్యారేజ్ ప్రస్తావన తెస్తారు .అప్పటి దాక ఎంతో ఓపికగా  చెప్పిన ఆర్య కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు ..
తన ఛాంబర్కి వెళ్ళి  తన సీట్లో కూర్చొని ఉదయం వాళ్ళ అమ్మతో జరిగింది గుర్తుకు తెచ్చుకున్నాడు ..
కన్న ఆర్యు అంటూ సరళ  గారు వస్తారు
” చెప్పు  అమ్మ  ఏం చెప్పనురా నీ వయసు వాళ్లంతా చక్కగా మ్యారేజ్  చేసుకొన్ని హ్యాపీగ లైఫ్ లీడ్ చేస్తుంటే నువ్వు ఇలాగే ఉంటె ఎలార? అని ఏడుస్తారు..
వాళ్ళఅమ్మను  హాగ్ చేసుకోని సారీ అమ్మ
” ప్లీజ్ మా నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని అమ్మ కనీళ్లు తుడిచి సరే అమ్మ నేను మ్యారేజ్   చేసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నేను తప్పకుండా చేసుకుంటాను అంటాడు..
ఆర్యన్ వెంటెనే  కళ్ళు తెరిచి అమ్మకు  మాట అయితే ఇచ్చాను కానీ పెళ్లి చేసుకొని నేను హ్యాపీగ ఉండగలనా అని బాధపడి  అమ్మ కోసం అయిన నేను మారాలి అని నిర్ణయం తీసుకుంటాడు..
నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు  వాళ్ళ ఇంట్లో ఎవరివో నవ్వు వినిపిస్తుంది తాను పట్టించుకోకుండ వెళ్ళిపోతాడు భోజనం చేయడానికి వచ్చినప్పుడు      ఆర్యన్ తో వాళ్ళ అమ్మ ” కన్నా నీ కోసం ఒక అమ్మాయిని చూసాను నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేస్తాను అంటారు తాను మీ ఇష్టం అమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు ..
తన రూమ్ కి వెళ్లి ఒక ఫోటోను చూస్తూ “నా ప్రేమ నీకు చెప్పలేక పోయాను నువ్వు ఎక్కడ ఉంటావో కూడా నాకు తెలియదు కానీ అమ్మ కోసం తప్పదు.. కాని నా మనసులో నీకు తప్ప ఇంకా ఎవరికి చోటు ఇవ్వను”
తరువాత రోజు సరళ గారు ఆర్యని తొందరగా లేవమని చెప్పి పట్టు పంచె ఇచ్చి రెడీ అయి వెంటనే రమ్మని చెప్పి వెళ్ళిపోతారు.ఆర్యన్ రెడీ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ గారు ఆర్య ని తీసుకొని గుడికి వెళ్తారు.. ఇప్పుడే నీ పెళ్లి అని చెప్పుతారు ఆర్య షాక్ అయి “అమ్మ ఎప్పుడు నువ్వు నా పెళ్లి గ్రాండ్ గా  చేయాలి అంటావుగా మరి ఇప్పుడు ఇలా సింపుల్ గా నీకు ఇష్టమైన …
” నా కోడలి కోరిక రా పెళ్లికి పెట్టే డబ్బులను ఏదైనా ఆర్ఫనేజ్ కి డొనేట్ చేయమని చెప్పింది.నాకు కూడా ఆ ఆలోచన  నచ్చింది.మనం ఇచ్చే డబ్బుతో ఎంతో మంది పిల్లల కడుపు నిండుతుంది..అది చాలా సంతృప్తినిస్తుంది అని అర్థం అయింది..ఆర్యన్ షాక్ అవుతాడు అమ్మను ఒప్పించింది అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే సరళ గారు ఎవరి విషయంలో అయిన కాంప్రమైజ్ అవుతారు కానీ ఆర్యన్ సంబంధించిన ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అసలు కారు…అలాంటిది అంతా సులువుగా ఒప్పుకున్నారు ..మొత్తానికి ఎవరో ఆ అమ్మాయీ???అని మనసులో అనుకున్నారు..
పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది ..
ఆర్యన్ కి ఆ ఫోటోలోనే అమ్మాయీ గుర్తుకి వచ్చి బాధ పడతాడు ..ఇంతలో అమ్మాయీ వచ్చి కూర్చుంటుంది  వాళ్ళిద్దరికీ అడ్డుతెర పెడతారు..
వధూవరులు జీలకర్ర ,బెల్లం పెట్టుకున్న తర్వాత వారి మధ్య ఉన్న తెరను తీస్తారు. ఫోటోలోని అమ్మాయీ దూరం అవుతున్న ఫీలింగ్ వస్తుంది..బాధగా కళ్ళు మూసుకుంటాడు..
అర్యు ఏమైంది రా ? ఏమి లేదు అమ్మ అని కళ్ళు తెరిచి ఎదురుగ ఉన్న వారిని చూసి  తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు ..ఎందుకంటే తను ఎవరి కోసం బాధ పడుతున్నాడో తానే పెళ్లి కూతురిగా తన ముందు ఉంది .పంతులుగారు  సమయం మించిపోతోంది అని తాళి ఇచ్చి కట్టమంటారు.
ఆర్య ఆ అమ్మాయిని చూస్తాడు తాను నవ్వి సిగ్గుతో తలదించుతుంది.ఆర్యన్ నవ్వుతు తాళి కట్టి మిగిలిన తంతు పూర్తీ చేస్తారు …
సరళ గారు ఆర్యన్ తో సర్ప్రైస్ ఎలా ఉందిరా అంటారు …
అమ్మ నీకు ఎలా తెలుసు?????
ఒక రోజు పని అమ్మాయితో  నీ రూమ్ క్లీన్ చేపిస్తుంటే నీ డైరీని చూసి నీ ప్రేమ విషయం తెలుసుకున్న తరవాత మీ కాలేజీ కి వెళ్లి అమ్మాయీ వివరాలను సేకరించి నీకు ఇలా సర్ప్రైస్ ఇచ్చాను అంటాడు..నువ్వు నీ ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నావుగా  తనకు ఇప్పుడు చెప్పు…
ఆర్యన్ సిగ్గుపడుతాడు
సరళగారు నీ కన్నా నా కోడలు గొప్ప రా..
తను నీకు ప్రపోస్ చేస్తుంది చూడు
ఆ అమ్మాయీ మోకాళ్ళ పైన  కూర్చొని చేతిలో ఒక ఫ్లవర్ తీసుకొని …
“నేను నిన్ను చూసిన నిమిషం నన్ను నేను మర్చిపోయాను .నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను నీకు నా ప్రేమను చెప్పాలి అనుకున్న కానీ నా పరిస్థితి నన్ను వెనుకకు లాగింది.. ఎందుకంటే నేను ఒక అనాధను, నా అన్నవాళ్ళు లేరు. దాతల వల్ల చదువుకున్న. నీ స్థాయీకి నేను సరిపోను అనుకున్న.
నా మనసులో మీకు తప్ప ఇంకా ఎవరికి స్థానం ఇవ్వకూడదు అనుకున్న.. అందుకే క్షణం తీరిక లేకుండా గడిపాను.. ఎక్కడ ఉండలేక అశ్రమంలోనే ఉండేదాన్ని
కానీ అత్తమ్మ వచ్చి మీ ప్రేమ విషయం చెప్పి నా కోసం మీరు ఎంత ఆరాట పడుతున్నారో,మీరు కూడా నన్ను ఇంకా మర్చిపోలేదు అని తెలుసుకున్న..
నన్ను కోడలిగా కాకుండా కన్న కూతురిలా గా చూస్తానని అత్తమ్మ చెప్పింది.చెప్పడమే కాకుండా నన్ను ఇంటికి తీసుకొని వచ్చారు.అమ్మలాగ నాకు ఆహారం తినిపించారు.రాత్రి మీరు నా ఫోటో చూస్తూ బాధ పడడం చూసాను అప్పుడే వచ్చి కలుద్దాం అనుకున్న కానీ అత్తమ్మ ఆపి ఇలా పెళ్ళిలో సర్ప్రైస్ చేద్దాము అన్నారు..మీ ప్రేమ తో పాటు అమ్మ ప్రేమ దొరుకుతున్నపుడు మిమల్ని ఎలా వదులుకుంటాను చెప్పండి.
నా ప్రేమ ని ఒప్పుకొని మీ జీవితంలో నాకు చోటు ఇస్తారా అని .
ఆర్య తన ప్రేమకి చలించిపోయి వెంటనే తనను హాగ్ చేసుకొని లవ్ యూ సో మచ్ అంటు
తన మొహమంతా ముద్దులు పెడుతుంటాడు
బాబు ఇది గుడి మీ కార్యానికి ఇంకా టైం ఉంది అన్న పూజారి మాటతో ఇద్దరు సిగ్గుపడి దూరం  జరుగుతారు .
ఇద్దరు వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ,వాళ్ళ అమ్మ ను హాగ్ చేసుకుంటారు …
తరవాత ఆర్య వాళ్ళ అమ్మ తో ” నేను నా ప్రేమను తెలిపి తను కాదు అంటే తట్టుకోలేను ఏమో అన్న భయం తో నా ప్రేమను చెప్పలేక పోయాను …కానీ నువ్వు నా ప్రేమ ను నాకు ఇచ్చావ్ అని చెపుతాడు తనని కోల్పయిన క్షణం నుంచి నేను మొండిగా తయారు అయి ఒంటరితనాన్ని ఆశ్రయించాను.
సరళ గారు ” కన్నా నాకు చిన్నప్పటి నుంచి నీకు నచ్చింది చేయడం, తెచ్చి ఇవ్వడం నాకు అలవాటు .. నీ ఇష్టమే నా ఇష్టం కదా అందుకే నీకు ఇష్టమైన అమ్మాయీను నీ లైఫ్ పార్టనర్ గా చేశాను అని చెప్పి హాగ్ చేసుకుంటారు ..
నువ్వు ఇప్పుడు ఆర్యవి కాదు ఆర్యనందనవి చెప్పుతారు ….
ఆ క్షణం నుంచి ఆర్య నందన జీవితంలో ఆనందం వెల్లివిరిసింది…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!