మనసునలా చంపేయకు
రచయిత :: మురళి కృష్ణ
మౌనంగా ఉంటూనే మనసునలా చంపేయకు…
దూరంగా వెళ్తూ నా గుండెనలా కోసేయకు…
నీ చెలిమితొ ఇపుడిపుడే చిగురించే ఆశనాది
ఆదిలోనె తొడుగుతున్న మొగ్గనలా తుంచేయకు…
కన్నీరే ఒలకకుండ కనుపాపై చూసుకుంట
నీ చూపుల జ్వాలలలో నిలువునలా కాల్చేయకు…
నా మరణపు అంచువరకు మాటెప్పుడు రానీయను
నీ మాటల తూటలతో మెదడునలా పేల్చేయకు…
నీవులేని జీవితం అలుముకున్న అంధకారం
వెలుగునంత తీసుకెళ్ళీ నిశినలా ఉంచేయకు…