అంశం: చీకటి వెలుగులు
బొమ్మా బొరుసు
రచన: కృష్ణకుమారి
తూరుపున చీకటి వచ్చిందంటే పడమట వెలుగు ఉన్నాదనే అర్థం
ఆ వెలుగే తూరుపున ఉదయిస్తే పడమర దిక్కు చీకటితో ఉందనేగా
గెలుపు ఓటములు, విజయాలుఅపజయాలు ఎత్తు పల్లాలు అన్నీ ఉన్నదే జీవితం!
వెలుగు ఎలా శాశ్వతంగా ఉండదో చీకటి కూడా శాశ్వతంగా ఉండదు
బొమ్మా బొరుసూ రెండూ అరచేతిలోనే బొమ్మని చూస్తుంటే బొరుసు వెనకే
బొరుసుని చూడాలంటే బొమ్మ వెనక్కి
ఒకటి లేకుండా మరొకటి లేదు.. ఏదీ ఎవరికీ శాశ్వతం కాదు