జనారణ్యం

జనారణ్యం

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

అది కాకులుదూరని కారడవి కాదు.
చీమలు దూరని చిట్టడవి కాదు.
అది చీమలులా పరుగు పెట్టే జనారణ్యం.
ఉరుకులు పరుగులు పెట్టె జనాలున్న ప్రాంతం.
అటవికన్యాయం అడవిలో అమలు కాకపోయినా
జనారణ్యంలో అమలవుతుంది.
ఆకలివేసినప్పుడే అడవిలో జంతువులు వేటాడి
ఆహారం సంపాదించుకుంటాయి.కాని ఈ జనారణ్యంలో మాత్రం ఆకలికి అంతులేదు.ఆకలికేకలు వినిపిస్తూనే వుంటాయి.
తిండిలేక వినిపించేవి కొన్ని మాత్రమే.మరికొందరి
ఆకలి ఎంత తిన్నా తగ్గదు.అలాంటి వారే ఎక్కువ
ఈ జనారణ్యంలో.
ఈజనారణ్యాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది.ఉప్పెనలా
వచ్చి పడింది ఒ మహమ్మరి. కంటికి కనిపించకుండా
మహాప్రళయాన్ని సృష్టించేసింది.దశాబ్ధాలుగా
ప్రభుత్వం సాధించలేని సమసమాజన్ని ఈ మహమ్మారి సాధించేసింది.లక్షలు లేక కరోనా బారిన పడిన దౌర్భాగ్యుణ్ణి లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి కోటీశ్వరులను కాటికి పంపేసింది.ఇద్దరివి అనాధ శవాలే.
కార్పోరేటు హస్పిటల్స్ రోగంచూసి చికిత్సచేయలేదు.
వారి ధనాగారాన్ని అంచనా వేసి చికిత్సలు చేశాయి.
కొంతమంది మానవత్వం మూర్తిభవించిన మహానుభ వులు తమ ఉదారతను చాటుకున్నారు.తమకు తోచిన సహాయాలు చేసి ఆదుకున్నారు.ఇదే అదునుగా పనిపాటులేని పనికిమాలిన వాళ్ళు సొమ్ము చెసుకోవడం ఆరంబించారు.
అలాంటి వారికి నాయకుడు రంగడు.ఎక్కడ ఎవరు ఉచితంగా ఇచ్చినా తెచ్చి దాచుకున్నాడు. దాచిన దాంతో దోచుకోవడం ప్రారంబించాడు.ఓ నలుగురు తనలాంటి వారిని పొగుచేసి తన పనులు చేయనారంబించాడు.మందులు శానిటైజర్లు మాస్కులు ఆహారపదార్ధాలు ఉచితంగా పంపిణి చేసేవన్నీ ఈ సమూహం సేకరించడం.వాటిని అమ్మి సోమ్ము చేసుకోవడం .
పూర్వాశ్రమంలో కూడా వీళ్ళు ఏమి చేసేవారుకాదు.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!