కదం తొక్కిన కలం(కాళోజీ వర్ధంతి సందర్భంగా)
రచన: ఐశ్వర్య రెడ్డి
నిజాం నిరంకుశత్వ పాలన ముగింపు కోసం బడుగు జీవుల భుక్తి కోసం
కదం తొక్కింది కాళోజీ కలం //
తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచడం కోసం నైజాం పాలన కు ఎదురునిలిచి
కదం తొక్కింది కాళోజీ కలం //
ప్రజల గోడును ప్రపంచానికి తెలియడం కోసం ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ కదం తొక్కింది కాళోజి కలం//
బానిస బ్రతుకుల విముక్తి కోసం
నవ తెలంగాణ నిర్మించడం కోసం
కదం తొక్కింది కాళోజీ కలం //
అక్షరమే ఆయుధమై ప్రజా ఉద్యమానికి ఊతమై,
రజాకార్లపై ఎక్కుపెట్టిన బాణంలా
కదం తొక్కింది కాళోజి కలం//
అన్యాయాన్ని ఎదిరించడం కోసం
సమాజ శ్రేయస్సు కోసం
కదం తొక్కింది కాళోజి కలం //
తెలంగాణ నవ కవులకు మార్గమై
యువతకు గమ్యమై ,తెలంగాణ భాషకు యాసకు వన్నె తెచ్చి
కదం తొక్కింది కాళోజి కలం//
రాతలనే తూటాలతో ప్రశ్నించిన ప్రజా కవి కలం , గోంతేత్తిన పద్మవిభూషణుడి గళం
దేశానికి అంకితం అన్న మహోన్నతుని జీవితం //
Nice👏👏👏👏