స్వాతి చినుకులు
రచన:రాధ ఓడూరి
చిరుజల్లుల స్వాతి చినుకులు
బాల్యం ఆనందాలకు తెరతీసింది
ఆశల ఆశయాలకు రెక్కలు తొడగాలని
తనువుని తాకిన తడి చెబుతోంది
పుడమి తొలకరి జల్లులతో పరవశమై
రేపటి ఊహలను నిక్షిప్తం చేసుకోమంది
తరువుల చిరుసవ్వడులు కొత్త ఊపిరినిస్తూ
స్వాగతం చెబుతోంది చిన్నారి ఆనందానికి