అమ్మాయి గారు

అమ్మాయి గారు

రచన: క్రాంతి కుమార్

నీ తియ్యని మాటల ప్రవాహం ఎక్కువైనా
నా మనసు దాహం తీరలేదమ్మాయ్

నీ మేను మెరుపుల సొగసులు చూస్తున్నా
నా కనుల వీక్షణ ఆగలేదమ్మాయ్

నీ మెరుపు కళ్ళల్లో చిలిపితనాన్ని ఆస్వాదిస్తున్నా
నా హృదయ తపన తీరలేదమ్మాయ్

నీ నగుమోము లో అందం రెట్టింపు అవుతున్నా
నా మది పోందే తన్మయత్వం చాలలేదమ్మాయ్

నీ వయ్యారి నడక కులుకులను చూస్తున్నా
నా ఎదలయలో మొదలైన గిలిగింతలు ఆగలేదమ్మాయ్

నీ స్వచ్ఛమైన ప్రేమకై ఎదురు చూడటంలో
కలిగే తియ్యని బాధలోని హాయి ఎవరికి తెలుసు
అనుభవించే నాకు మాత్రమే తెలుసమ్మాయ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!