అందాల రాశి!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: తొర్లపాటి రాజు (రాజ్)
అందాల రాశి…
నీ అంద చందాలు చూసి
కలలు కంటి కన్నులు మూసి
ఓ ప్రేయసి…
నీ తనువును తలవంగ తెలిసే
నువ్వొక రూపసి నీది కన్యారాశి
ఓ నా ఊర్వశి
నిదుర లేకుండా చేసిన రాక్షసి
నేను అంటే ఎందుకంత కసి
నిన్ను పదే పదే తలచి
కలల్లోనే….కలిసి
మనసంతా ఆనందంతో…అలిసి
నిను కలిసేందుకు నలుదిక్కుల
కాపు కాసి
తెగ తత్తరపాటు పడుతున్న
ఓ..నా లావణ్య రాశి… మానసి
వేరొక చూపు నిన్ను చూస్తుంటే
ఒకటే..జెలసి
ఓ రాక్షసి…
అరవై కేజీల అందమున్నదని
అహం…..బలిసి
వేదిస్తున్నావే…
నా గుండె కోసి కోసి
యెదుట పడవే…
ఓ నా ప్రియమైన ప్రేయసి
చస్తా..మనసారా నిను చూసి!
కరుణించి కసి తీర్చుకోవే…
అందాల రాక్షసి!