ఓ యువతా కదలిరా

ఓ యువతా కదలిరా

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఓ యువతా భవిత నీదె,
హలం నీదె, కలం నీదె,
రాక్షసుల పాలిట గన్ను నీదె,
తీర్చిదిద్దారా తీరం చేరేదాక,
సహనం బలహీనత కాకూడదుర,
వేయారా ముందడుగు జంకుగొంకు లేక;

అవినీతి పాలిట అస్త్రానివై,
కామాంధుల పాలిట బ్రహ్మాస్త్రమై,
సుజనుల పాలిట చుట్టానివై,
దీనుల పాలిట దీన బంధువై,
అభ్యుదయ విప్లవ జ్వాల వెలిగించ,
కదలిరా యువతా కదలిరా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!