కష్ట జీవి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సా ప్రగడ పద్మావతి
అంతెత్తు నుండి దింపే
కల్లు కుండల్లో
ఊపిరి బిగబట్టి
నెత్తికెత్తుకునే కట్టెమోపుల్లో
పోటెత్తె కెరటాలతో పోరాడి
సముద్రాన్ని చిలికే నీకండల్లో
దోపిడీకి గురైన నీ కష్టం
నిస్తేజంగా రోదిస్తుంది
పలుగు పారపట్టి
నువ్వు మట్టితో పొట్లాడినప్పుడు
కదలలేక కదిలే ఏడ్లబండికి
నువ్వు ఇరుసైనపుడు
నీకు అనిపిస్తుంది
ఇసుక తిన్నెల మీద నేర్చిన అంకెలు
బ్రతుకు పాఠాలు నేర్పలేదని
రెక్కలు ముక్కలయ్యేకా
చేతికొచ్చిన పైసలు
నీచేత కాని తనాన్ని వెక్కిరిస్తుంటాయి
ఈకాలపు మనిషివి కాదని
చెప్పకనే చెబుతుంటాయి….
బాగుంది పద్మావతి గారు మీ కష్ట జీవి కవిత
అభినందనలు