మౌన శ్రోత

మౌన శ్రోత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : రేపాక రఘునందన్

పలకరించని నేస్తాలు
పలవరించే నేత్రాలు
మౌనమయితే
మధుర స్మృతులు మాయమై
శిధిల శకలాలౌతాయి…
అంతరంగంలో బాధల హాలాహలం
అలజడి పుట్టిస్తే
మరణయాతన భరించలేని రోగిలా
గుండె గుప్పిట్లోకి జారాలని చూస్తుంది…
ఆలోచనలు అంబరమెక్కి సమావేశమైతే
మనస్సు వక్తగా మారుతుంది
మౌనం శ్రోతగా మిగులుతుంది
వణికే చేతిలో వంకీ కర్ర
వగలు పోయినప్పుడు
వార్దక్యం వలవల ఏడుస్తుంది
ఆడే గుండె ఆగిపోతే
శరీరమంతా నిశ్శబ్దం
అవయవాలకు ఎక్కడ లేని ఆనందం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!