అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు
అంతెరుగని బావి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
మన గ్రామాల్లో బావులను అందరు చూసే ఉంటారు. బావుల్లోని నీళ్లు తాగడానికి, వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తుంటాం. వర్షాలు సరిగ్గా పడకపోతే, బావుల్లో నీళ్లు ఎండిపోయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.
మన దేశంలో, వేసవికాలం చాలా బావులు చుక్క నీరు లేకుండా ఎండిపోతుంటాయని తరచు వింటూనే ఉంటాం. కానీ, ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతంలో ఉన్న ఈ బావి తీరే వేరు. ఈ బావిలో నీళ్లు ప్రవాహంలా ఎల్లప్పుడూ బయటకు ఊబికి వస్తూనే ఉంటాయట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ బావిలో నీళ్లు అలా వస్తూనే ఉన్నాయట. ఇలా మన దేశంలో ఊరికి ఒక్క బావి ఉంటే చాలు. మనకున్న నీటి ఎద్దడి తగ్గిపోయి, ఎన్నో పంటలు పండించేవారు కదా! మన రైతులు.
ఈ బావి గురించి, మరిన్ని విశేషాలు తెలుసుకుందామా!
ఈ బావిలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారట. కొంతమంది చనిపోయారు కూడా. ఎంతో నైపుణ్యం గల డైవర్లు కూడా ఆ బావి అంతు తెలుసుకోలేకపోయారు.
ఇప్పటికీ ఆ బావిలో నీళ్లకు సోర్స్ ఏమిటో కనుక్కోలేకపోయారు.17వ శతాబ్దంలో ఫ్రెంచ్ ప్రజలు పబ్లిక్ బాత్హౌజ్గా ఈ బావిని ఉపయోగించారట.
శతాబ్దాలు గడిచినా బావిలో నీళ్లు మాత్రం తగ్గలేదు.1974లో ఇద్దరు ప్రొఫెషనర్లు డైవర్లు బావి అడుగుభాగంలో చాలా దూరం ప్రయాణించారట. కాని, వాళ్లు కూడా ఆఖరికి ఆ బావిలోకి నీళ్లు ఎలా వస్తున్నాయో. తెలుసుకోలేకపోయారట.
ఇదండి ఫ్రాన్స్ లోని బుర్గుండి ప్రాంతంలో ఉన్న బావి గురించి, ఇప్పటి వరకు తెలుసుకున్న సంగతులు.
కానీ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాత్రం కనుక్కోలేకపోయారు. గత ఏడాది మరో ఇద్దరు డైవర్లు బావి ముఖద్వారం నుంచి 370 మీటర్ల దూరం వరకు వెళ్లగలిగారు. కానీ వాళ్లు కూడా నీటి ఊట ఎక్కడుందో కనుక్కోలేకపోయారు.
(గూగుల్ సేకరణ)