వేడి వేడి పండు

వేడి వేడి పండు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

నేరేడు చెట్టు పై
దొరికే కాయలు
తింటూ పిల్ల వాడు!
మధ్యాహ్నం యెండ
మలమలని మాడుస్తుంటే!
భూమంత నిప్పు ల
తో పోరాడి నట్టుంది
అప్పుడు ఒక ముసలి
తాత దారి పోతుండ!
బాబయ్య నా కొక్క
పండు పడవేయవా
అని అడుగా!
చల్ల చల్లని పండ్లు
జలజలా రాల్చేదా!
వెచ్చ వెచ్చని పండ్లు
విసరి పడవేసేదా!
విడ్డూరం పండ్లు
ఏంటి వేడి వేడి సరే
వేడి పండ్ల నే పడవేయి!
చేతి మీద అనగనే
పిల్లవాడు కొమ్మల
ఊపగా బలం కొద్ది!
అల్లంత దూరాన
ఇసుకలో పండ్లు
రాలగా పండ్ల కొ
రకు ముసలి తాత
పడుతూ పడుతూ
ఒకటి రెండు ఏరు కో
ని ఊదు కోసాగాడు!
ఉప్ఫు ఉప్పు అని
ఊదుతావే తాత
అంత వేడిగా ఉన్నా
వా ఏమి చెప్పవా!!
చెడకాలి పోతంటే
కాబట్టి నల్లబడి కమిలి
పోయిన తాత మండే
పొట్టుకు వేడి వేడి పండు
పడవేస్తే వేడి వేడి తో!
చల్లపడి పోతదన్నాడు
తాత నవ్వుతూ మను
మడి కొంటేవొ అనా నే
మనుమడు ఐతే నీవు
మంచి తాత అన్నాడు!
పిల్లవాడు చెట్టు దిగుతూ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!