అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్!(పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జూల్స్ వెర్న్
సమీక్షకులు: ఎం.వి.చంద్రశేఖరరావు
సాహస రచనలకు పెట్టింది పేరు, జూల్స్ వెర్న్.అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీడేస్, సముద్రగర్భంలో సాహసయాత్ర లాంటి ఎన్నో ఒళ్ళు జలధరించే రచనలు చేసిన రచయిత జూల్స్ వెర్న్. మేము రాజమండ్రి గ్రంధాలయంలో, బాల్యంలో
ఎంతో ఇష్టపడి చదివే రచనలు, సాహస రచయిత జూల్స్ వెర్న్ వే. కధ ఏమిటంటే ఫాగ్, అతని ఫ్రెండ్స్, ప్రపంచాన్ని ఎనభై రోజులలో, చుట్టిరాగలమా, లేమా అని పందెంకడతారు. ఫాగ్ ప్రపంచయాత్రకు బయలుదేరుతాడు. రకరకాల దేశాలను చూస్తూ 81 రోజులలో ప్రపంచయాత్ర చేస్తాడు. పందెం ఓడిపోయాననుకుంటాడు, కానీ, భూమధ్యరేఖ అంక్షంశాల తేడావల్ల అతను పందెం గెలుస్తాడు. 1872 లో ప్రచురితమైన రచన ఇది. చలన చిత్రంగా
కూడావచ్చిన రచన ఇది. ఈసారి ఇదే రచయిత వ్రాసిన 20000లీగ్స్ అండర్ ది సీ, (సముద్ర గర్భంలో సాహసయాత్ర) పరిచయం చేస్తాను.