ప్రకృతి వనరులు
రచన :: సుజాత.కోకిల
కళ్లు నులుపు కుంటు మమ్మి అంటు ఏడ్చుకుంటు వచ్చాడు చిన్నా. ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నా బంగారం కదు చెప్పు అంది దుర్గ.
నాకు… నాకు… నిద్ర వస్తుంది,
మరి వెళ్లి పడుకోమ్మ.
మరి… మరి… నాకు రోజు కధ చెప్పుతావు కదా. ఈ రోజు కుదురదు నాన్న రేపు చెపుతానుగా వెళ్లి పడుకో.
ఊహు పడుకోను, నువ్వు కధ చెపితేనే పడుకుంటాను అంటూ మారాం చేసాడు చిన్న.
ఇక అన్నాడంటే వదలడు. సరే నాన్న చెపుతాను పద.
ఏమండి చిన్నాని పడుకొబెట్టి వస్తాను. కాస్తా ఓపిక పట్టండి, 
సరే సరే అన్నాడు గోపికృష్ణ.
చిన్నాని బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకోబెడుతూ నీకు ఏ కధ చెప్పాలి అంది దుర్గ.
చందమామ రాజు కధ చెప్పు మమ్మి అన్నాడు చిన్న.
సరే, అనగనగా ఒకరాజు ఉండేవాడు అతను వేటకు వెళుతూ అలసిపోయి ఒక చెట్టుకింద కుర్చున్నాడు. అతనికి చాలా దాహం వేసింది. చుట్టుపక్కల చూసాడు ఎక్కడా మోటబావి కాని కొలను కాని ఏమి కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అటువైపుగా వెలుతున్న బాటసారి కనిపించాడు. చాల దాహంగా ఉంది ఇక్కడ ఏమైన కొలను కాని బావికాని ఉందా అని అడిగాడు రాజు. అయ్య మేము దాహం తీర్చుకోవాలంటే ఇంకా రెండు మైళ్లదూరం పోవాలయ్య ఈడ ఏడ ఉంటాయి అన్నాడు.
చిన్నా వింటున్నావా? ఆ మమ్మి వింటున్నాను చెప్పు మమ్మి.
ఆ… ఆ చెప్పుతున్నాను. ఎంతో మంది ఆడవాళ్లు కుండలు పట్టుకుని వెలుతున్నారు, అమ్మ అంటు పిలిచాడు.
చెప్పు నాయన, ఏం కావాలి మీకు.
దగ్గరలో బావులు కాని చెరువులు కాని ఏమి లేవా?
ఏం చెప్పమంటావు నాయన మేము రోజూ ఇంతే ఇంతింత దూరం వచ్చి తెచ్చుకోవాలి అంది ముసలమ్మ. ఇంక వెలుతాను మా ముసలోడు ఒకటే దాహం అంటున్నాడు. బేగిరమే వెళ్లాలి అంటూ తను వెళ్లిపోయింది.
తను కూడ వినిపించుకోనట్టుగ ఉన్నాడు అయ్యో నా రాజ్యంలో ఇంత మంది దాహం కోసం ఇంతదూరం వెళ్లాలా? తన మనసుకు చాల బాధ అనిపించింది. ఇంక తనకు దాహం అనికూడ అనిపించలేదు తను రాజ్యానికి వెళ్లారు. ఇంక ఒక్క నిముషం కూడ ఆలస్యం చేయకుండా ప్రతి ఊరిలో అందరికి అందుబాటులో ఉండేటట్టుగా బావులు చెరువులు గుంటలు తవ్వించారు.ఏ ఒక్కరు కూడా బాధ పడకూడదు అని అనుకున్నాడు అప్పటినుండి చెట్లను నాటడం, నీరు అందించడం చేస్తూ వచ్చాడు ప్రకృతి అందంగా ఉంటేనే మనం కూడ బాగుంటాము అనుకున్నాడు.
మనం కూడా చిన్న చిన్న చెట్లను నాటాలి. అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుంది చిన్న వింటున్నావ అంటూ చిన్న వైపు చూసింది దుర్గ. అప్పుడే నిదురలోకి జారుకున్నాడు. హమ్మయ్య అనుకున్నది. మంకు పట్టు అనుకున్నది. అయ్యేదాక వదలడు, అని నవ్వుతూ అనుకుని నుదిటిపై ముద్దు పెట్టుకుని తన పనిలో నిమగ్నమైంది దుర్గ.
***
