ప్లవ నామ సంవత్సరం
రచయిత: కె.వి.వి.లక్ష్మీ కుమారి
వచ్చింది వచ్చింది” శ్రీ ప్లవ నామ సంవత్సరం” వస్తూ.. వస్తూ..కోటి ఆశలను మోసుకొచ్చింది
కొత్త కోరికలను చిగురింపజేస్తూ…
సరికొత్త ఊసులను మనముందుంచుతూ..
కోయిల రాగలాపనతో తీపి కబుర్లు పంపిస్తూ..
గడిచిన విపత్కర పరిస్థితుల తాలూకు నీలి నీడలను మరిపిస్తూ….
ప్లవ నామ వత్సరంలో అంతులేని ఆనందాలని
చవి చూపిస్తాను అంటూ
మావి చిగురు లేపనాన్ని రంగరిస్తూ ,
షడ్రుచుల మేలుకలయికతో ముస్తాబై
వచ్చింది వచ్చింది మన మేలుకోరి నూతన ప్లవ నామ సంవత్సరం
నిన్ను నన్ను తన రాకతో ఊరిస్తూ..ఊరడిస్తూ..
తన కొత్త రాకతో తల్లడిల్లిన జీవితాలకు సరికొత్త క్రాంతి చూపుతానంటూ..
నిన్నూ నన్నూ మన అందరినీ ప్లవ నామాన్ని
స్మరియింప చేస్తూ
వసంతపు ఋతురాగంలో నవ వసంతాన్ని
తిలకించ మంటూ …
వచ్చింది వచ్చింది
మనకోసం శ్రీ ప్లవ నామ సంవత్సరం..
మన ఎదముంగిట నిలిచింది కోటి శుభాలతో.. కల్మషం లేకుండా
తనలాగే అందరుండాలని కోరుకుంటూ…
***