కళ్ళు

కళ్ళు

రచయిత:: హసీనాఇల్లూరి

అందమైన నీలాల కనులు అని
ఆడవారిని కవులు పొగుడుతుంటే
నీ కనులు చూసి ఉండరు అందులకే
నా మనోహరుడి మనోహరమైన కనులను
చూసి ఉంటే వేల కవితలు పుట్టుకొచ్చేవి

నీ కళ్ళలోని చిలిపిదనం నా
మనసుకు చెక్కిలిగిలి పెడుతుంది
నీ కళ్ళలోని ప్రేమ నా మనసుని
తాకి నను నీ ప్రేమలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

నీ కళ్ళలో కోపం చూసిన నేను బెదిరితే
చటుక్కున నవ్వి మాయ చేసే అవే కళ్ళు
నువ్వు కన్ను మీటగానే పెరిగే నా ఎదసవ్వడి
నీకై నే ఉన్నాను అని చెప్పే నీ కళ్ళు

నీ కళ్ళు సప్తవర్ణాల హరివిల్లుని పలికించగలవు
నీ కళ్ళు మాయ చేసి మైకం తెప్పించగలవు
నీ నీలాల కనులు నాపై కురిపించే ప్రేమని
ఈ లోకంలో ఏవి సరితూచలేవు సఖుడా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!