(అంశం:: “చాదస్తపు మొగుడు”)
నా మొగుడు
రచయిత :: సుజాత తిమ్మన
వారాలకు దేవుళ్ళ
పేర్లు అతికించి
దోతికట్టి
విభూది రేఖలు పెట్టి
మంత్రోచ్ఛారణ,
అర్చనలతో …
కాలానికి చుట్టుకు
పోయి ఉంటాడు
నా మొగుడు !
ముచ్చట లేదు
మూర మల్లెపూలు లేవు
మూడుముళ్ళేసి
మూడేళ్లు నిండినా
మూసుకోలేదు తలుపు
ఇదే వరస నామొగుడుది
ఆడబిడ్డ ఆటపట్టింపులు
అత్తగారి అలవికాని ఆరళ్ళు
మామగారి ముభావుకత
మరిదిగారి జాలిచూపులు
ఇవేమీ పట్టించుకోక
పుణ్యావచనాలతో
పిలక సర్దుకుంటుంటాడు
నా చాదస్తం మొగుడు
