అంతులేని ఆశలు
రచన: సుశీలరమేష్.M
అంతులేని ఆశల వలలో చిక్కి
ధనార్జనే ధ్యేయంగా
నేను నేనే అంటూ
నాకెవరు సాటి లేరు అంటూ
అమితమైన గర్వంతో
విర్రవీగుతూ
బంధాలను విస్మరిస్తూ
ఆలిని దూరం చేసుకుని
కన్న బిడ్డలను కరుణించక
వెర్రి ఆవేశంతో బంధాలను తెంచుకుని
నేస్తాలను చులకన చేసి
చూసిన నేను
ఆప్యాయత అనురాగాలను
వదులుకొని అంతుచిక్కని
ఆకాశం లాంటి ఆశలకు
అర్రులు చాచిన నాకు
నేడు అన్నీ ఉన్నాయనే
ఆనందం పంచుకునే
ఆత్మీయులు లేని
ఈ నిశీధి రాత్రిలో
అలసిన నా బ్రతుక్కి
శూన్యంలో రోదన మిగిలింది.