(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)
విశ్వ విజేత
రచన:: లోడె రాములు
చిత్రం భళారే… విచిత్రం..
కంటికి కనిపించని శత్రువు
విశ్వామంతా విస్తరించి ..
విశ్వ విజేతగా నిలిచింది ..
రికార్డులనన్నింటిని బద్దలు కొట్టి
తనని సంవరించే వారే లేరని విర్రవీగింది..
చిత్రం… భళారే విచిత్రం..
రామాయణ, మహాభారత,ప్రపంచ యుద్దాలు కూడా
ఇంత కాలం జరగలేదు…
ఏ భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు విస్పోటమైనా
ఇంత జన నష్టం జరగలేదు..
అంతంతగానే అతుకుల బొంతలా ఉన్న..
మానవ సంబంధాల విలువలు తెలిసివచ్చే..
ఎక్కడికక్కడ ఎవరికి వారే యమునా తీరే…
జగమంత కుటుంబం ఉన్నా అనాధలమయ్యాం ..
ఒక్కసారి భూమిని మలిచినట్లు..
స్మశానాలు ఇంట్లోనే వెలిసినట్లు..
చిత్రం భళారే విచిత్రం..
గృహాలన్నీ నిర్భంద నిలయాలై బిక్కు బిక్కు మంటూ
తన చెయ్యే తనకు శత్రువాయే..
పీల్చే గాలిని, తినే తిండిని, పెట్టే చేతిని అనుమానంగా,
అవమానంగా చూస్తిమి…
చిత్రం భళారే…విచిత్రం..
ఈ శతాబ్దoలో కరోనా కష్టాలు చిత్ర…
విచిత్రాలు ఇంటింటికి కన్నీటి గాధలే…
***