(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
నిరీక్షిస్తున్నా
రచన:: జీ వీ నాయుడు
అమ్మా.. అవనీ నీ పిలుపు కోసమే
అనురాగం పంచుతావని ఎదురు చూస్తున్నా
ఊహలను ఎన్నో రగిలించావు
వలపులతో నన్నే మరిపించావు
తీయని మాటలతో ముంచెత్తావు
తీరా కళ్ళు తెరిచి చూస్తే చిత్రం
భళారే విచిత్రం
కలలోనే కబుర్లు చెప్పావని
నమ్మలేకున్నా
నిత్యం నీ ధ్యాస తో నే పయనిస్తున్నా
ఎన్నెన్నో తెలియని ఆశలు మిగిల్చావు
ఈ వేళలో నీవు ఏమీ చేస్తూ ఉంటావో
అనుకుంటూ ఉంటాను ప్రతి క్షణమూ నేను
నువ్వు వస్తావని నా చెంతకు
చేరుతావనీ
నిరీక్షిస్తున్నా నీ రాక నాకొక
పూల బాట అవుతుందనీ
బంగారు భవితకు నాంది పలుకు తావనీ….