మధురం
రచన:: యాంబాకం
మానవ జన్మ మధురం
మానవలోకం అతి మధురం
పచ్చని తోటలు మధురం
తోటలలో పండిన పండ్లు అతి మధురం
చిన్ననాటి జ్ఞాపకాలు మధురం
వయస్సు లోని కోరికలు అతి మధురం
కళ్యాణ మొదటి రాత్రి మధురం
కలలు కనే కాపురం అతి మధురం
మానవ జన్మ మధురం
మానవలోకం అతి మధురం
సొంత ఇంటి కలలు మధురం
బామ్మ చేతి అరెసలు అతి మధురం
వర్ష చినుకులలో తడిసిన మధురం
అందరితో కలసి కష్టాలు పడటం అతి మధురం
కోయిల పాటలు మధురం
మయూరి నాట్యం అతి మధురం
చిన్నారుల మాటలు మధురం
పెద్దల దీవెనలు అతి మధురం
రాత్రివేలలో చందమామ మధురం
చందమామ లోని వెన్నెల అతి మధురం
చెట్టు కొమ్మల్లోని పూవు మధురం
ఆ పూవు లోని మకరందం అతి మధురం
సూర్యుని ఉదయ కిరణాలు మధురం
సాయం సంధ్య వాలు అతి మధురం
నా చిన్నాటి చదివిన చందమామ కథ లు మధురం
తపస్వి మనోహరం లో నా కవిత విప్పడం అతి మధురం
****