చిన్న చిన్న ఆలోచనలు
రచన: లోడె రాములు
భూదేవి మెడలో పచ్చని చెట్లను హారంగా వేయాలని…
రోడ్ల కిరువైపులా నర్సరీలు ఆహ్వానం పలకాలని
చిన్న చిన్న ఆశ..
రకరకాల మొక్కలన్నీ ఔషద గుణాలున్నవే
ఓర్పు నేర్పు.. తెలుసుకునే జిజ్ఞాస
ఆచరించే చిత్త శుద్ధి ఉండాలే కానీ కాదేది వ్యర్థం…
కాష్టస్ ఇగ్నియస్..నేడు ఇన్సులిన్ మొక్కగా ప్రాచూర్యం
పోపు పెట్టెలో దినుసులు
మెడికల్ షాప్ ఇంట్లో ఉన్నట్లే
మొక్కలు మన ఆరోగ్యానికి సమతూకం
ఇక దేశీయ ఆవులు మన బీజామృతం
గార్డెన్లో తూగుటుయ్యాలలో ఊగుతూ..
ఉసిరి టీ తాగుతూ ఉంటే ఆ అనుభూతే వేరబ్బా
చుట్టూ తులసి కోటలు ఆహ్లాదమైన గాలి
మకరందం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈగలు..
సమానత్వం అనేది సృష్టి ఆవిర్భావం లోనే లేదు..ప్చ్
విక్షణారహితంగా మొక్కల్ని, భూముల్ని,వాతావరణాన్ని,
తినే తిండిని కాలుష్యంతో నింపుతున్నాం..
అలాంటి పంటల్ని బహిష్కరించి
సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సహం ఇద్దాం..
ఇలాంటి వెన్నో..నాలో చిన్న చిన్న ఆలోచనలు.. ఏ తరం తీరుస్తుందో
**********