ఆ పందిరి

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారంగానూ”)
ఆ పందిరి
రచన::రాయల అనీల
“నేను ఇక్కడ పడుకొను….. నాకు ఇదోద్దు  ” అని గోల చేస్తుంది మూడేళ్ల స్వీటీ.
” అబ్బబ్బ….. ఏంటే నీ గోల చస్తున్నాను నీతో ”
” వా ఆ……..వా…..😭” అని ఏడుపు మొదలు పెట్టేసరికి
” ఆ … ఇదొక్కటి వచ్చు….. ఈ పిల్ల రాక్షసికి”
” వా ఆ……..వా……😪”
” సరే..సరే చెప్పు….. ఎం కావాలి…..నాకు అసలే నిద్రోస్తుంది ……ముందు ఆ ఏడుపు ఆపి చెప్పు”
” మమ్మీ…..మరేమో నాకు ఆ స్టార్ పం….. పం…… ”
“స్టార్ పం.. ఏంటే…… ఎక్కడ చూసావ్ అసలు ”
” అదే మమ్మీ….. పం….. కింద పడుకుంటారంటగా నీకు తేలిదా🤔”
” పం….. కింద పడుకోడం ఏంటే….. ”
” పో మమ్మీ😡…నీకెం తెలిదు ….. నేను డాడీనే అడుగుతా”
”  నాకు తెలియంది మీ డాడీకి తెలుసా……. ఏంటబ్బా అది🤔”
” చిన్న పిల్లని నాకు తెలిసిందే నీకు తెలియదు🤭  ఇక డాడీకి తెలిసినవి ఎలా తెలుస్తాయి 😛 నీకన్నా డాడీకే ఎక్కువ తెలుసు”
” నువ్వు చిన్న పిల్లవి కాదే …..చీలి రాకాసివి”
” 😏”
” ఇవన్నీ కాదు…. ఇప్పుడు నిద్ర పోతావా లేదు ”
” నాకు అదే కావాలి…..కావాలి…..కావాలి…..కా….”
” అబ్బబ్బ….. ఏంటి రాధ గోల ….. అవతల ఎంత ముఖ్యమైన ఫోన్ కాలో తెలుసా ”
” 🙄 ఇది మరి బాగుంది…… గోల నాది కాదు మీ కూతురిది”
” నా కూతురా…. నా కూతురు  అలా చేయదే…… బంగారం ఏమైంది నాన్న ….. ఇంకా నిద్ర పోలేదెమి ఎందుకు ”
” డాడీ ఈ మమ్మీకి ఏమి తెలీదు🤭 …… నేను చేప్తే వినట్లే ”
” అవును బంగారం…. ఇది మాత్రం నిజం😃 ”
” 🤨 చాలు….చాలు ముందు దాని బాధ చూడండి”
” డాడీ మనం స్టార్ పం…… కింద పడుకుందాం రా….”
” స్టార్ పం… ఆ అదేంటి నాన్న ”
” ఆ సరిపోయిందా🤭….ఇప్పుడు చెప్పండి సమాదానం”
” ఏంటి బంగారం అది ….. ఎవరు చెప్పారు నీకు అది ”
” నువ్వే 😌”
” నేనా….ఏమి చెప్పాను బంగారం….. ఎప్పుడు చెప్పాను ”
” మరే ……మార్నింగ్ మమ్మీ బయటకి వెళ్ళినప్పుడు నాకు ఓ స్టోరీ  చెప్పావుగా….. అందులో మీరు చిన్నప్పుడు స్టార్ పం… కింద పడుకునేవారు…. చాలా బాగుండేది అని చెప్పావుగా…….నాకు అది కావాలి…..నేను దాని కిందే నిద్రపోతా”
” హహహ…..అది స్టార్ పం…. కాదు నాన్న…. చుక్కల పందిరి……”
” హ అదే….అదే నాకు అది కావాలి ….కావాలి…కా..”
“ఓసి నీ ఇల్లు బంగారం గానూ అదా ”
” హహహ ”
” సరే ఐతే మనం డాబా మీదకి వెళ్దాం పదా….”
” అక్కడుందా డాడీ ఆ స్టార్ పందిరి…… వెళ్దాం….”
” మరి మమ్మీ…..”
” ఆ తీసుకెళ్దాం….. పాపం మమ్మీకీ ఏమి తెలియదు ….. మమ్మీ కూడా చూస్తుంది😁”
” హహహహ🤭”
” సర్లే…. పదండి పైకి …… ఇప్పటికే చాలా లేటైంది”
**

” బంగారం చూడు పైకి…… ఎలా ఉంది ”
” హయ్ ..భలే….భలే….. ఏంత బాగుందో😀 ….. కదు మమ్మీ ”
” అవును నాన్న …. నీకు నచ్చిందా”
” హ ….. చాలాలాలాలా……. మనం రోజు ఇక్కడే నిద్రపోదామా”
” నీ ఇష్టం బంగారం ”
” చూడు మమ్మీ నేను ఆ చుక్కలు  లెక్క పెడుతా……… 1,2,3,4,5,………

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!