ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం

ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

అంతర్జాతీయచట్టం భద్రత ఆర్థికాభివృద్ధి
సామాజికాభివృద్ధి మానవహక్కులపై సమిష్టికృషికై
ప్రపంచదేశాలు ఏర్పాటుచేసుకున్న అంతర్జాతీయసంస్థ
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

ప్రాదేశిక సమగ్రత కాపాడడం
యుద్ధభయం ప్రజలలో తొలగించడం
నిరాయుధీకరణ శాంతిస్థాపన లక్ష్యాలుగా
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

ఎనిమిది అంశాలు మౌలికసూత్రాలుగా
రూజ్ వెల్ట్ చర్చిల్ ల నడుమ
ఓడలో జరిగిన ఒప్పందం
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

నానాజాతిసమితికి ప్రత్యామ్నాయంగా ఆవిర్భావం
అంతర్జాతీయ సహకారమే కర్తవ్యం
శాశ్వతసభ్యత్వాన్ని పొందెను మనదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు…!

సాంస్కృతిక విద్యావైజ్ఞానిక సంస్థ
అంతర్జాతీయ బాలల అత్యవసరనిధి
నోబుల్ బహుమతి పొందిన అనుబంధసంస్థలెన్నో
చూడచక్కని తెలుగు సున్నితంబు…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!