ఆనంద విరహం

ఆనంద విరహం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కూచిభట్ల హయగ్రీవ శర్మ

నీ నిశ్వాస పీల్చలేనంతదూరంలో ఉన్న నీ అర్థ భాగం వ్రాస్తున్న ఆనందవిరహ లేఖ.
ఉభయకుశలోపరి, ఏంటో ఎన్నో కథలలో కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశ పెట్టిన వందేభారత్ శకటం లా, కథానాయకుడు ద్వారా కథానాయికకు ఉత్తరాలు, ప్రేమలేఖలు వ్రాసిన నా..కలం మొదటి సారిగా, నీకు లేఖ వ్రాయడానికి, ప్రతీ స్టేషన్లో ఆగే శకటంలా కదలడానికి శంకిస్తోంది. నాలాగా దీనికి కూడా నువ్వు అంటే ఎంతో భయం తెలుసా!ఎప్పుడు నన్ను తిడతావుగా! ఇలాంటి సవతిని తీసుకు వచ్చాను అని. ఇప్పుడు అదే మన ఇద్దరి మధ్య అక్షర వారధి అయినది. నీకు ఒక విషయం చెప్పనా! నువ్వు పుట్టింటికి వెళ్తాను అన్నప్రతీసారీ.
ఎందుకు వదద్దంటానో తెలుసా! నిను చూడకుండా నేను ఒక్క రోజు కాదు.. కాదు ఒక్క గంట కూడా ఉండలేను కాబట్టి. నిత్యం నీ ముత్యాలొలుకు పలుకులకు, నీ తేనెలొలుకు అధర ముద్రలకు నన్ను వ్యసనపరుడిని చేసి, నేను కాదనలేని కారణం చూపి నానుంచి పుట్టింటికి వెళ్ళిపోయావు, అయినా! నిను చూడలేక నేను ఉంకో వారంలో అక్కడ కి వాస్తాను. అప్పుడు నీతో సహా మన ప్రేమకు ప్రతిరూపాన్ని కూడా నాతో పాటు మన ఇంటికి తీసుకు వచ్చేంతవరకు అక్కడ నుంచి అస్సలు కదలను. నాకో… అనుమానం! నేను అసలు నీకు గుర్తు వస్తున్నాన! లేక మీ అమ్మ వాళ్ళ తో సేవలు చేయించు కుంటూ నన్ను మర్చిపోయావా! నువ్వు కూడా ఈ ఆనందవిరహం తట్టుకోలేక పోతే. నువ్వు కూడా నాకై నీ ఆనందవిరహాన్ని అక్షరలాతో అమర్చిపంపు.

ఇట్లు
నీకై పరితపించే నీ పతి
పద్మనాభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!