కోడలికి ప్రేమతో

కోడలికి ప్రేమతో

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

చి. సౌ. ప్రమీలను ఆశీర్వదించి అత్తయ్య వ్రాయునది. అక్కడ నీవు, మనుమడు క్షేమమని తలుస్తాను. ఇక్కడ నేను బాగానే ఉన్నా! వయస్సు రీత్యా మరియు మానసిక పరిస్థితిరీత్యా నిన్ను మనుమడిని చూడాలని ఉంది. విది బలీయం. పండిన పండు చెట్టున ఎన్నాళ్ళు ఉంటుంది. ఎపుడో అపుడు రాలి పోతుంది కదా!. ఇక అసలు విషయం.
నా కొడుకు భాస్కరం ఆక్సిడెంట్ లో పోయి నాలుగేళ్ళయింది. అపుడు నీవు నిండు చూలాలువి. మామగారు మంచం మీద ఉన్నారు కదా! ఆ బెంగతో నెలరోజులకే వారు పోవడం. నీకు మన ఊళ్ళోనే మనుమడు పుట్టడం వాడికి మామగారు పేరు పెట్టడం జరిగింది. మా వాడి ఆఫీస్ లోనే ఉద్యోగం నీకు ఇస్తే లో, అమ్మా జీవితం నీది చెయ్యి పిల్లడిలో భర్తను చూసుకో అన్నాను.
నీ జీవితం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో  ఆపద్బాంధవుడిలా మీ ఆఫీస్ లో పనిచేసే సతీష్ సరాసరి నా దగ్గరకే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు వద్దన్నా! సమాజం గురించి ఆలోచించకు కులాలు, మతాలు మనం పెట్టుకున్నవే అతనిని పెళ్ళి చేసుకో నూరేళ్ళ జీవితం నీది బాబు భవిష్యత్ చూడు మగతోడు అందునా మంచి మనిషి దొరకడం వచ్చిన అవకాశం వదలకు అని పెళ్ళి చేశాను. మీరు రమ్మన్న ఆయన కట్టిన ఇంట్లో జ్ఞాపకాలతో ఓపిక ఉన్ననాళ్ళు ఉంటానన్నాను. అలాగే నన్ను సతీష్ నా కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుని ప్రతి ఆదివారం అమ్మా! ఎలా ఉన్నారని ఫోన్ చేయడం, నెలకోసారి రావడం ఈ వృద్ధాప్యం లో నాకు అంతకన్నా కావలసింది ఏముంది. కరోనా వలన దూరంగా మీరు హైదరాబాద్ లో ఉండటంచే ఈమధ్య రాలేదు. ఇప్పుడు వాక్సిన్ లు వేయించుకున్నాము. కరోనా ఉధృతం తగ్గింది. పెద్దాదాన్ని ఎందుకో మిమ్మల్ని ముఖ్యంగా నా మనుమడిని చూడాలని ఉంది. తప్పక వస్తారని ఆశీస్తు…

ప్రేమతో

మీ అత్తయ్య

పార్వతమ్మ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!