చూడాలని ఉంది

చూడాలని ఉంది

రచన: జయకుమారి

చూడాలని ఉంది
ఒక్కసారి అయిన నిను చూడాలని ఉంది.

నా మనస్సు దోచిన నీ మోహనరూపం
ఒకసారి కనులరా చూడాలని ఉంది.

నా చేతిలో చందమామ వై నీవు
నీ ఒడిలో చంటిపాప నై నేను ఉండాలని ఉంది.

నా ఎదలో కొలువైన నీవు
రెప్పవెనుక తొలిస్వప్న మై ఉన్నవాని చెప్పాలని ఉంది.

నా ఊహలన్ని ఊసులుగా మలచి
నీ దోసిట నింపాలని ఉంది.

నేను వేసే ప్రతి అడుగు నీకోసం వెయ్యాలి అనివుంది.

నీవు ఏ క్షణం అయితే నా మదిలో కొలువైనావో
తెలియదు కాని.
నేను అనే మాటే మరచి నీలో సగం అయ్యాను.

నా తుది శ్వాస వరకు నా మనస్సుకు తోడుగా
ఉంటాను అనే మాట ఇస్తావా అని అడగాలని ఉంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!