“డాగ్ యజమాని”

“డాగ్ యజమాని”

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: యాంబాకం

సర్వత్కృష్టమైన ఈ మానవజన్మ లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అటువంటి మహోన్నతమైన జన్మను కొంతమంది మనుషులు పలు దుర్వ్యసనాలతో, దుష్కృత్యాలకు, దురాగతాలకు, దురాశలతో, దుర్నీతితో వృథా చేసుకుంటున్నారన్నది నిజం.
కొందరు మాత్రం స్ఫూర్తిప్రధాతలుగా తమ జీవితాన్ని తోటి సాటి సహపాటులై, వారి మేలు కోసం వారి అభ్యున్నతికి, సమాజ శ్రేయోభిలాష కోసం, లోకకళ్యాణార్థం పాటుపడుతుంటారు. వీరంతా స్ఫూర్తిప్రధాతలుగా ధన్యజీవులు” గా పిలువబడుతారు.
అసలు విషయానికి వస్తే “ఏ పుట్టలో ఏ పాము ఉందో!” అనేది పాత సామెత..ఇప్పుడు కొత్త సామెత “ఏ డాగ్ లో ఏ స్కిల్ ఉందో!” ఇది నేటి సామెత.
కెమెరాకు అందంగా ఫోజులిస్తూ..నోట బ్రష్ పట్టుకుని రకరకాల రంగు రంగుల చిత్రవిచిత్రాలను కేన్ వైస్ పై గీస్తున్న ఈ సునక రాజు పేరు “ఆర్ బార్” వయస్సు కేవలం రెండు సంవత్సరాలు…ఒక అప్పుడు ఈ డాగ్… ఓ వీధి కుక్క, ఇప్పుడు ఇది వీధి కుక్కలకు ఆశ్రయం ఇచ్చి ఏకంగా డాగ్ షెల్టర్స్ సాయపడింది. ఓ అతి సాధారణమైన వీధికుక్క “ఏవరికైన ఒక రోజు వస్తుంది.” అన్న సామెతను నిజం చేసింది. ఈ డాగ్ కు ఒక రోజు కలసి వచ్చింది. ఈ డాగ్ ను చూడగానే బ్రెన్, జెన్నీఫర్ అనే దంపతులు పెంచు కుంటామని తీసుకెళ్ళారు. అప్పటికి వారికి “ఈ డాగ్ కు పెయింటింగ్ స్కిల్ ఉన్నాయన్న విషయం తెలియదు. “అసలు ఈ డాగ్ కు కూడా తెలిసి ఉండదు మరి. కానీ తన యజమాని ఆశ్చర్య పోయాలా.. బ్రష్ నోటకరుచుకుని పెయింటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ పెయింటింగ్ లు కూడా సాదా, సీదాగా లేవు. చాలా నైపుణ్యం ఉన్న చిత్రకారుడు వేసిన పెయింటింగ్స్ లా ఉండేవి. ఈ డాగ్ గీచే రంగు రంగుల చిత్రాలు.
ఈ డాగ్ వర్ణ చిత్రాలు కళాభిమానుల్ని బాగా ఆకర్షించడమే గాక రేటు పలికేవి వెనకా ముందు ఆలోచించకుండా దగ్గర దగ్గరగా 400/- డాలర్లన్నా కొనేదానికి ముందుకు రాసాగారు. పత్రికలు, టీ.వి లు “ఆర్ బార్” గురించి ప్రకటనలు కూడ చేశాయి. ఇక మన డాగ్ గారు మంచి పాపులర్ అయిపోయారు. అంతే గాక దీని పెయింటిగ్స్ కు గిరాకి పెరిగింది. సహజంగా మూగ జీవుల శ్రమను సొమ్ము చేసుకొని వాటి కష్టం పై వచ్చిన సొమ్ము తో జీవనం గడిపే మనుషులు ఎంతో మంది మనకు తెలుసు…అయితే “ఆర్ బార్ ” యజమాని ఆ పెయింటింగ్ విక్రయించగా వచ్చిన సొమ్ముని సొంతానికి వాడుకోలేదు. ప్రతి ఆదాయం డాగ్స్ యొక్క సంరక్షణా కేంద్రాలకు, డాగ్స్ ఆరోగ్య రక్షణ కోసం, డాగ్స్ కు మంచి ఆహారం అందించేందుకు వినియోగించడం, వీధికుక్కలకు షెల్టర్స్ ఏర్పాటు చెయ్యడం వంటి మంచి పనులు చేసాడు. ఇది అతని స్ఫూర్తి కి నిదర్శనం. ఇలా మూగ జీవులను వాటి టాలెంట్ ను కనిపెట్టి బ్రెన్, జెన్నీఫర్ లా మూగజీవాలను కాపాడుకొని మనం వారిలా స్ఫూర్తి ప్రధాతలుగా మిగిలిపోదాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!