డాక్టర్ శోభా రాజ్ గారు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
వ్యాసకర్త : నారు మంచి వాణి ప్రభా కరి
సంగీత సాహిత్య ప్రజ్ఞా గాయని, ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీ మతి డాక్టర్ శోభా రాజ్ గారు
అత్యంత ఘనులు విశిష్ట సంగీత కళకారిణి,
శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు అత్యంత అద్భుతంగా పాడుతూ ప్రజలకు ఆనందం, ఆహ్లాదం కలిగిస్తారు.
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యం లో శ్రీ అన్నమయ్య ప్రాజెక్ట్ ద్వారా ఎంతో అమూల్య మైన కీర్తనలు, క్యాసెట్లు, సి.డి లుగా వచ్చాయి. అవి ఎందరికో అత్యంత ఉపయోగము. రాగాలలో భావాలు పలికిస్తూ పాడిన రీతి అద్భుతము, ఆనందము.
ఎందరో కళాకారులను తీర్చి దిద్దుతున్నారు. విదేశాల్లో కూడా ఎందరో నాకు చాలా తెలిసిన వారు సంతోషము వ్యక్త పరిచారు. ఆమే గళంలో ఒక గంభీరం ఉన్నది. అమృతధారల్లా శ్రీ అన్నమయ్య రచన విశిష్టతను పాటల్లో చూపుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు, అలిమెలుమంగ, పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని భక్తితో పాడి ఆనందడోలలో ప్రజలను ఆనంద పరిచారు.
ప్రతి పాట ఆమె ఎంతో లీనమై పాడుతారు. అటువంటి విశిష్ట వ్యక్తి నుంచి నేను అవార్డ్ పుచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, లయన్స్ క్లబ్ ద్వారా ఆవిడను సన్మానించి ఆవిడకు సన్మాన పత్రం అందించడం మరో ఎత్తు, ఆమే ఎంతో ఆప్యాయంగా పలుకరించారు. శిల్ప కళారామం లో ఆవిడ సంగీత కచేరీలు నిర్వహిస్తారు. అక్కడికి వచ్చి పాడితే బాగుంటుంది అన్నారు.
మీ దీవెనలు ఇస్తే చాలు, మీ లాంటి వ్యక్తిని లయన్స్ (తణుకు) వారు లయన్స్ స్వర్ణ ద్వారా సన్మానించడం నా పూర్వ జన్మ సుకృతం అని ఆనంద పడ్డాను.
శ్రీ అన్నమయ్య కీర్తనలు, శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణ కృపా కటాక్షములు వల్ల ఆమె ఎంతో బాగా పాడుతున్నానని ఆనందంగా చెప్పారు. అసాధారణ ప్రజ్ఞా ఉన్నా సాధారణంగా పలుక రిస్తూ..శ్రోతలను ఆనందపరిచారు. ఆవిడకు సన్మాన పత్రం రాసి అందించడం నా అదృష్టము. అపూర్వ ప్రజ్ఞా పాటవాలు ఆవిడ సొత్తు. ఈ ఫోటోలో ఆవిడ తో పాటు శ్రీ దైవజ్ఞశర్మ గారు, అర్.అర్. కే శ్రీ సప్తగిరి దూరదర్శన్ డైరెక్టర్ ఉన్నారు. శ్రీ త్యాగరాజు గాన సభ (హైదరాబాద్),
శ్రీ నందమూరి తారక రామారావు సాహిత్య సంగీత రాష్ట్ర స్థాయి అవార్డ్, మనోరంజని సంస్థ నుంచి అందుకుంటున్న చిత్రము. ఆమే స్ఫూర్తిప్రధాత, సంగీత విభాగంలో అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి అపూర్వ మహిళ డాక్టర్ శోభా రాజ్ గారు.