ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : అద్దంకి లక్ష్మీ

   సునీత, అనిత ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు. ఇద్దరూ చదువులో హుషారుగా ఉండే వారు.
అయితే సునీత చాలా నెమ్మది. అడుగు వేస్తే ఆలోచించి మరీ వేస్తుంది చామన చాయతో చక్కటి గుండ్రంగా ఉండే కళ్ళు అందంగా కనిపిస్తుంది.
అనిత చాలా చాలాకి. సునీత, అనిత కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద. ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకుంది.
తల్లిదండ్రులు ఆమె స్థిరపడిన తర్వాత మంచి సంబంధం వెతికి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయి గోపాల్ తో పెళ్ళి జరిపించారు.
ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. అనిత చాలా చలాకీ అయిన పిల్ల. అందరితో కలివిడిగా కలిసిమెలసి ఉంటుంది. స్నేహంగా ఉంటుంది. ఆమెకి మనసులో కల్మషం లేదు అందర్నీ నమ్ముతుంది.
ఆమె చలాకీ తనం చూసి ఎందరో మగ పిల్లలు వెంట పడుతుంటారు. మగ పిల్లలతో కూడా స్నేహంగా ఉంటుంది. సునీత అప్పుడప్పుడు హెచ్చరించేది.
“మరీ అందరితో అలా పూసుకు తిరగరాదే! మగవాళ్ళని అసలే నమ్మరాదు!” అంటూ హెచ్చరించేది. అనిత పట్టించుకునేది కాదు.
“నీవు నాకు నీతులు చెప్పక్కర్లేదు, అన్నీ నాకు  తెలుసు నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా!” అంటూ గర్వంగా మాట్లాడేది. చదువు అయిన తరువాత ఆమెకి కూడా మంచి జాబ్ వచ్చింది.
అయితే సుధాకర్ అనే ఒక యువకునితో పరిచయమై స్నేహంగా మారి ప్రేమలో పడింది. సుధాకర్ ఆమెతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు అతని మీద నమ్మకం కుదిరింది.
అతను ఇంకొక కంపెనీలో పని చేస్తున్నానని చెప్పాడు. ఇద్దరు సినిమాలు, షికార్లు తిరుగుతుండేవారు.
అనిత అతన్ని బాగా నమ్మింది. సుధాకర్ చెప్పాడు “నాకు తల్లిదండ్రులు లేరు. ఢిల్లీలో మేనమామ దగ్గర పెరిగా నేను”
“మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పాడు”. అనిత అతని మాటలు  నమ్మింది. తల్లిదండ్రులు అక్క హెచ్చరించారు. తెలియని వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకోకూడదు అని. వారిని తొందరగా నమ్మరాదు అని ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్లు ఏమీ చేయలేకపోయారు.
కానీ అనిత పూర్తిగా అతన్ని నమ్మింది. చేసేది ఏమీ లేక తల్లిదండ్రులు అక్క సునీత, ఆమె పెళ్లి జరిపించారు.
ఒక యేడాది బానే జరిగింది సంసారం. సడన్ గా అతని ఉద్యోగం పోయింది అతడు కంపెనీలో సరిగా పనిచేయడం లేదని తీసేసారు. అనిత అనుకున్నది తనకి జాబు ఉంది కదా పర్వాలేదు అని. అతనికి చాలా దుర్గుణాలు ఉన్నాయని తర్వాత మెల్లి మెల్లిగా తెలిసింది.
రోజు ఫ్రెండ్స్ తో వెళ్ళి తాగి ఇంటికి లేటుగా వస్తాడు. డబ్బులు అడుగుతాడు. జీవితం నరకప్రాయం అయింది అనితకు. అక్క సునీత దగ్గరకు వచ్చి ఎంతో ఏడ్చింది.
“పరవాలేదు ఏదో సర్దుకో నువ్వు. అతను మళ్ళీ దారిలోకి వస్తాడు” అని ఓదార్చింది. కానీ కొంత కాలం తర్వాత అతడు అనితని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమె తల్లిదండ్రుల పంచన చేరి ఉద్యోగం చేసుకుంటోంది. కొత్తవారిని నమ్మవద్దు అని చెప్పినా వినిపించుకోలేదు అనిత.
పిల్లలు చేసుకునే ప్రేమవివాహాలు పెద్దల నుండి సపోర్టు తక్కువగా ఉంటుంది. పూర్వం అందుకే కుటుంబాలలో గౌరవమర్యాదలు కూడా చూస్తూ ఉండేవారు.
ఏమీ పరిచయం లేని వారికి ఆడపిల్ల నిచ్చి పెండ్లి చేసేవారు కాదు. తస్మాత్ జాగ్రత్త ఆడపిల్లలు.
ప్రేమ, ప్రేమ అంటూ తిరిగే మగ పిల్లలని తొందరగా నమ్మవద్దు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల సుఖసంతోషాలు కోరతారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!