అంతా రంగుల మయం.

అంతా రంగుల మయం.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుశీల రమేష్.

భార్య : “ఏవండోయ్”
భర్త : “ఏమిటోయ్”.
“ఏం లేదండి కొన్ని చీరలు కొనుక్కోవాలండి అన్నది దీర్ఘాలు పోతూ భార్య”.
“అదేమిటోయ్ దీవాలి ముందే కదా !
అరడజను చీరలు..వాటి మీదకు డజన్ మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు తీసుకున్నావు” అన్నాడు భర్త.
“తీసుకున్నాను! కానీ చీరలో బ్లౌజ్ ఉంటుంది. ఇంకొకటి ఎక్స్ట్రా ఒక చీరకు రెండు బ్లౌజులు సరిపోతాయి. ఆ లెక్కన ఇంకా ఆరు బ్లౌజ్ పీసులు ఉన్నాయి. వీటికి తగ్గ మ్యాచింగ్ చీరలు తీసుకోవాలండి, పైగా సంక్రాంతి పండుగ కూడాను వెళ్దాం పదండి” అంటుంది భార్య.
ఎట్టా!? చీరకు తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ పోయి..బ్లౌజ్ కు తగ్గ మ్యాచింగ్ చీర కొనే రోజులు వచ్చాయా? అంతా రంగుల మయం అన్నమాట అంటూ భర్త స్పృహ తప్పి పడిపోయాడు” సోఫాలో. “మీరు ఇలాగే పడుకుని ఉండండి, ఈలోపు నేను జస్ట్ ఇలా వెళ్ళి అలా మ్యాచింగ్ చీరలు తీసుకొని వచ్చేస్తాను” అన్నది భార్య.
“ఆగవోయ్ కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు చిలకరిస్తావు అనుకున్నాను. కానీ ఇలా నన్ను వదిలేసి వెళ్తావు అనుకోలేదు” అన్నాడు భర్త.
“కళ్ళు తిరిగి పడిపోయిన మీరు ఇక్కడే ఉంటారు కదండీ. మళ్లీ నేను వెళ్లడం ఆలస్యమైందంటే బ్లౌజ్ తగ్గ మ్యాచింగ్ చీరలు దొరకవు, మళ్లీ నాలుగు షాపులు తిరగాల్సి వస్తుంది. అక్కడ ఇంకేమైనా నచ్చితే తీసుకోవాలనిపిస్తుంది. ఇంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు కదా అండి. మీకు తెలుసు కదా! ఈ విషయం అర్థం చేసుకోరు అన్నది” భార్య.
‘ఎంత కష్టమొచ్చిందే నీకు నా భార్యామణి’.
“నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అంతేనా నీకెందుకు అంత కష్టం నేను వస్తాను బ్లౌజ్ కి తగ్గ చీర, చీరకు తగ్గ బ్లౌజులు కొనుక్కుంటూ కూర్చుంటే. ఆ షాపింగ్ మాల్ ముందు బిక్షగాడి పాత్రలో నేను సెటిల్ అవ్వాల్సి ఉంటుంది.
‘నా ఖర్మ కాకపోతే.. ఉదయం నాకు ఇష్టమని చిల్లు గారెలు చేసి కొసరి కొసరి వడ్డించినప్పుడే నేను ఆలోచించాల్సింది. “ఇదేదో నా జేబుకు చిల్లు పెట్టే ప్రోగ్రాం పెడుతున్నావని ఊహించలేకపోయాను”.
అనుకుంటూ భార్య వెనుక వెళుతూ బ్రహ్మానందం స్టైల్లో అంతా రంగులమయం అని అనుకుంటు వెళుతున్నాడు’ భర్త.
“ఏవండీ వస్తున్నారా”
‘ ఆ రాక చస్తానా అంత లిస్ట్ చదివాక’
“వస్తున్నా”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!