స్నేహం

స్నేహం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

గిరిజకు ఎంతో సంతోషంగా వుంది. తన చిన్న నాటి స్నేహితులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం. ఇంట్లో భర్తనీ, పిల్లల్ని ఒప్పించింది.
ఎందుకంటే తన ముగ్గురి స్నేహితుల భర్తలు కూడ తన భర్తకి మంచి స్నేహితులే. ఎలా అంటే
వాళ్ల పిల్లల పెళ్ళిలకి వెళ్ళడం వలన వాళ్ళ మధ్య మంచి స్నేహమే కుదిరింది.
స్నేహితుల పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్ల, పాపలతో విదేశాల్లో ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు శివరాత్రికి స్నేహితులతో తమ ఊరిలో రాత్రి జాగరణ చేసి గడిపేవాళ్ళు..మరల ఇన్నాళ్ళకి అంటే
50 ఏండ్లకి మరల ఇప్పుడు టైం కుదిరింది. అదే సంతోషంలో ఇల్లంతా నీట్ గా పెట్టడం అన్ని   సరుకులు భర్తతో చెప్పి తెప్పించడం. తన కూతురుతో కలిసి ఆ రోజు ఏం వంటకాలు చేస్తే బాగుంటుందో చర్చించడం, ఆ హడావిడిలో
ఆ రోజు రానే వచ్చింది. గిరిజ స్నేహితురాలు ఒకరు తరువాత ఒకరు వారి భర్తలతో రానే వచ్చారు. అంతా సందడిగా అయిపోయింది. తను వాళ్ళకి ఆ సాయంత్రం కూల్ డ్రింక్ ఇచ్చి, వేడిగా బిర్యానీ చేద్దాం అని కూతురు అనితను పిలిచింది. “ఏమిటే ఇప్పుడు నీవు చేసేది ఏ వంట చేయ్య‌వద్దు”. అది ఏమిటే మీకు ఏం ఇష్టం చెప్పండి. కొన్ని చేసి కొన్ని హోటల్లో నుండి తెచ్చుకుందాం అంది. ఏమి అవసరం లేదు అని వాళ్ల భర్తలకు సైగ చేశారు. వాళ్ళు కిందకి వెళ్ళి కార్లో ఉన్న ఐటమ్స్ ముగ్గురు ఒక్కొకరు ఒక్కొక ఐటం తెచ్చారు.
అలాగే చూస్తు నిలుచున్న గిరిజ అవి టేబుల్ మీద పెట్టీ ఓపెన్ చేసి “నీకు ఇష్టమని జిలేబి నేను తెచ్చాను అని ఒక  స్నేహతురాలు ఉమ చెపుతూ మూత తీసి చూపెట్టింది”. ఇంకో స్నేహితురాలు రాణి “నీకు వెజ్ బిర్యానీ ఇష్టం కదా అని ఇంకా దానిలోకి ఆలు గ్రేవీ తీసి చూపెట్టింది. “ఇంకో స్నేహితురాలు పద్మ “నీకు పకోడీ ఇంకా మైసూర్ పాక్ ఇష్టం కదా అంటు చూపెట్టింది. అవి అన్ని తన చిన్న నాటి ఇష్టాలు వాళ్ళు ఇప్పటికి వాటిని గుర్తు పెట్టుకొని తీసుకురావడం గిరిజకు చెప్పలేనంత సంతోషం అయింది. ఒక ఉదుటున తన ముగ్గురి స్నేహితురాళ్ల గట్టిగా పట్టుకుంది.
ఏమిటే ? అంటు వాళ్ళు గిరిజాను దగ్గరికి తీసుకున్నారు. వాళ్ల వైపు చూస్తూ మన ఇంట్లో వాళ్ళు కూడా మన ఇష్టాలు ఏమిటి? అని మరిచిపోయిన రోజుల్లో నా చిన్నప్పటి ఇష్టాన్ని జ్ఞాపకం పెట్టుకోని తేవడం ఎంతో ఆనందంగా ఉంది.
“అది ఏమిటి గిరిజ? నీ ఇష్టం మాకు కాక ఎవరికి తెలుస్తుంది. అన్నారు అదేగా స్నేహం అంటే అన్నారు”. “మీ ఇష్టాలేనా! మా ఇష్టాలను ఏమైనా చూసేది ఉందా అంటు గిరిజ భర్తతో పాటు మిగితా వాళ్ళు కూడా కోరస్ పలికారు. “ఓ తప్పక అందరం కలిసి స్నేహమాధుర్యాన్ని ఆరాగిందాం అంటు గిరిజ అందరికి ఘుమఘుమలాడే వంటకాలు ప్లేట్లో వడ్డించి…అందిరిచేతికి ఇచ్చింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!