మాధవ్ మధనం

మాధవ్ మధనం

 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శారద       

మాధురి, మాధవ్ ఇద్దరు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ రెండు నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయ్యింది. పది రోజుల్లో వాళ్ళ పెళ్లి. మాధురి, మాధవ్ లది విజయవాడ దగ్గరలో పక్క పక్కనే చిన్న చిన్న పల్లెటూర్లు. వీళ్ళిద్దరిదీ పెద్దలు నిశ్చయించిన పెళ్లి. పెళ్లి పది రోజులు ఉండడం చేత ఇద్దరూ సెలవులు తీసుకుని విజయవాడకు ఒకే కారులో బయలుదేరుతారు.
మాధురి చాలా సున్నితమైన మనస్కురాలు. ఎంగేజ్మెంట్ అయ్యి రెండు నెలలు అవుతున్నా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఎక్కడికి వెళ్ళలేదు.
మొదటిసారి ఇద్దరు కలిసి కార్లో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు.
“ఏంటి మాధురి ? సైలెంట్ గా ఉన్నావ్ ? ఏదైనా మాట్లాడొచ్చుగా”. అన్నాడు మాధవ్ కొద్దిగా నవ్వుతూ.
“మీరే ఏమైనా చెప్పండి”. అని అన్నది. “మనం ఇద్దరూ ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తున్నా, ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి కలిసి ప్రయాణం చేస్తున్నాం”. “పది రోజుల్లో మన పెళ్లి. ఊర్లో చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇవ్వాలి. షాపింగ్ కూడా చేయాలి. టైం చాలా తక్కువగా ఉంది”. అని అన్నాడు.
“అవునండి. నేను కూడా అంతే. నాకు చాలా పనులు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లికి పిలవాలి”. అని అన్నది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. మాధురి చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రటి పెదాలు, పొడువైన జడ, చాలా తెల్లగా అందంగా ఉంటుంది.
మాధవ్ కార్ డ్రైవ్ చేస్తూ ‘మాధురి ఎంత అందంగా ఉంది. నాకు ఇంత అందమైన భార్య దొరకడం నా అదృష్టం అని అనుకుంటాడు’. కార్ డ్రైవ్ చేస్తూ తననే చూస్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. సడన్గా పెద్ద గాలి వాన పడుతుంది.
“ఇంత పెద్ద పెద్ద గాలులు వేస్తుంటే మనం ప్రయాణం చేయలేము”. అని ఒక హోటల్ దగ్గర కార్ ఆపుతాడు.
“మనం నైట్ కి ఇక్కడే ఉంటే మంచిది. ఈ వర్షంలో మనం వెళ్లడం అంత మంచిది కాదు”. అని మాధవ్ చెప్తాడు. అప్పుడు మాధురి కొంచెం భయపడుతూ “అలాగే” అని అంటుంది.
మాధురి, మాధవ్ ఇద్దరూ హోటల్ కి వెళ్తారు. కారులో నుంచి దిగి హోటల్ కి వెళ్లే టైంలో ఇద్దరూ తడిచి పోతారు. ఇద్దరూ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటారు.
ఆ హోటల్ రూమ్ చాలా బాగుంటుంది. చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మంచి పువ్వుల మొక్కలతో, మంచి సువాసన వస్తుంది. తడిచిన బట్టలులో ఉన్న మాధురిని అదోరకంగా చూస్తాడు మాధవ్. మాధురి తన కంటికి చాలా అందంగా కనిపిస్తుంది. మాధురి తన జుట్టుని తుడుచుకుంటుంది. మాధురిని అలా చూస్తూ ఉంటాడు మాధవ్.
తన నడుమును చూసి పిచ్చెక్కిపోతుంది. ఎలాగో పది రోజుల్లో పెళ్లి చేసుకుంటాం కదా అని మాధురి గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు మాధురి కంగారుపడుతూ “ఏంటి మాధవ్ ? వదలండి. ఏం చేస్తున్నారు మీరు? వదలండి.” అని అంటుంది.
“నువ్వు చాలా అందంగా ఉన్నావు”. నిన్ను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ప్లీజ్ వద్దనకు. అని బుగ్గపై ముద్దు పెడతాడు.
మాధురి చాలా కోపంగా “ఏం చేస్తున్నారు మీరు? మనకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు ఇలా ఉండడం నాకు నచ్చదు. ప్లీజ్ నన్ను వదలండి”. అని అంటుంది.
అయినా మాధవ్ వినకుండా  మెడపై ముద్దులు పెడతాడు. “పది రోజుల్లో మన పెళ్లి. వాతావరణం చూడు ఎంత బాగుందో ప్లీజ్ వద్దు అనకు. నువ్వు నాకు చాలా నచ్చావ్ మాధురి”. అని అంటాడు.
“పెళ్లి అయిన తర్వాత ఏమైనా చేసుకోండి. పెళ్లికి ముందు నాకు ఇష్టం లేదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగితేనే బాగుంటుంది. ప్లీజ్ అండి. ప్లీజ్ ప్లీజ్”అని అంటుంది. మాధవ్ వదిలేస్తాడు. నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావ్ అనీ విసుక్కుంటాడు.
అప్పుడు మాధురి “బాగుంది… మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను మీకు నచ్చినట్టు ఉండలేను”. అని అంటుంది.
“భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. పెళ్లయిన తర్వాత మాత్రమే ఆ బంధం ఏర్పడుతుంది. పెళ్లి ఇంకా పది రోజులే కదా ఉంది. అంతవరకు ఆగలేరా”. అని సిగ్గుపడుతూ మాధవ్ కు ఒక ముద్దు ఇచ్చి కూల్ చేసింది. “పెళ్లికి ముందే ఒకటైతే ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఎందుకు చెప్పండి. నేను చిన్నప్పుడు నుండి ఎన్నో పెళ్లిళ్లు చూసా, ఒక తండ్రి అల్లుడు పాదాలు కడిగి తన కూతుర్ని కన్యాదానంగా ఇస్తాడు. కోటి యాగాలు చేస్తే ఎంత ఫలితమో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది తల్లిదండ్రులకి.”
“నేను ఈ కాలం అమ్మాయిని అయినా, ఎంత ఉద్యోగం చేస్తున్న, మా అమ్మ, నాన్న నేర్పిన విలువలు ఎప్పుడు నాతోనే ఉంటాయి అని చెప్పింది. “ఆ మాటలు విన్న మాధవ్ “సారీ మధు నేనే తప్పుగా ప్రవర్తించాను. పెళ్లి మీద, పెద్దల మీద నీకున్న అభిప్రాయం, గౌరవం నాకు నచ్చాయి” అని చెప్పి మాధురిని కౌగిలించుకున్నాడు. “వర్షం ఆగేలా లేదు ఉదయాన్నే వేగంగా లెగిసి మన ఊరు వెళ్ళిపోదాం” అని అన్నాడు మాధవ్.  ఇద్దరూ రాత్రి హోటల్ లో పడుకొని తెల్లవారి లేచి వాళ్ళ ఊరు బయలుదేరి పోయారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!