సాగర సంగమం

సాగర సంగమం

 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మోపిదేవి గౌతమి

సాగర్ విజయవాడ నుండి వైజాగ్ వెళ్లే డీలక్స్ బస్సులో తను రిజర్వేషన్ చేపించుకున్న సీట్లో కూర్చొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని పాటలు వింటున్నాడు. అప్పుడే హడావుడిగా వచ్చి బస్సు ఎక్కి తను రిజర్వేషన్ చేపించుకున్న 22వ నెంబర్ సీటు దగ్గరకు వచ్చి, తన లగేజ్ ని  పైన పెడుతుంది సౌమ్య. కళ్ళు మూసుకుని ఇయర్ ఫోన్స్ లో పాటలు వింటున్న  సాగర్ కు, ఏదో శబ్దం అయినట్లు అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. తన ముఖానికి చాలా దగ్గరగా
“తెల్లటి వర్ణంతో మెరిసిపోతూ ఉన్నది. అందమయిన ఆమె నడుము. ఆ అందం నుండి గుభాలిస్తూ వస్తున్నపరిమళమైన సువాసన
ఆమె చీర చెంగు, ఆమె కదిలిన ప్రతిసారి.. సాగర్ ముఖానికి తాకుతూ వుంటే..” ఆ మాయలో మైమరిచిపోతూ..మరో లోకంలో విహరించినట్లు అనిపించింది సాగర్ కి, కాసేపు.
కాని! సాగర్ కి తెలుస్తుంది, ఆమె మేని నుండి వచ్చే ఆ సువాసన. తనకు అంతకుముందే పరిచయం ఉన్నట్లు…లీలగా గుర్తుకు వచ్చి.
“సౌమ్య అన్నాడు. ” తన ఎదురుగా నిలబడి ఆ సీటు పైన ఉన్న ర్యాక్ పై లగేజ్ పెడుతున్న ఆమెను.
“హ ఏమన్నారు?”
“సౌమ్య అన్నారా? ”
“నా పేరు మీకు ఎలా తెలుసు?”
అంటు సాగర్ ప్రక్కన తను రిజర్వేషన్ చేపించుకున్న 22వ నెంబర్ సీట్ లో కూర్చుంటూ సాగర్ వైపు చూసింది  సౌమ్య. అంతే ఒక్కసారిగా అవాక్కయ్యి “అబ్బో! నువ్వా.. అని గట్టిగా అన్నది సౌమ్య.”
“హా నేనే.. బాగున్నావా సౌమ్య?” అని అడిగాడు సాగర్. “బాగున్నావా కాదు, బాగున్నారా!.. అని అడుగు చెప్తాను.”.అన్నది. కొంచెం కోపంగా.. సాగర్ వైపు చూస్తూ సౌమ్య.” సాగర్ పకపక నవ్వేసి. సరే సరే బాగున్నారా? సౌమ్య గారు.. అని అడిగాడు. అతని గొంతులో ఆప్యాయత ప్రతిధ్వనిస్తూ.. సౌమ్యను.
“బాగున్నాను..చాలా బాగున్నాను. అని చెప్పింది  సౌమ్య కొంచెం గర్వంగా..సాగర్ వైపు సూటిగా చూస్తూ.
“అయ్యో! అంత కోపంగా మాట్లాడతారు ఏంటి?సౌమ్య గారు. మీరు బాగున్నారు. ఆ విషయం నాకు తెలుస్తుంది. కనబడుతుంది కూడా..” అన్నాడు కొంటెగా. సౌమ్యవైపు చూసి కన్ను గీటి సాగర్. “ఇదిగో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుండి వేరొక సీట్లో కూర్చుంటాను. అన్నది వెంటనే సౌమ్య.”
“హా.. వెళ్లండి మంచి పని, వెతుక్కోండి. ఎవరైనా!వచ్చి ఇక్కడ కూర్చుంటే..ఆ ప్లేస్ లోకి వెళ్లి మీరు కూర్చోండి. కాని! ఒక చిన్న రిక్వెస్ట్. ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, ఇక్కడ కూర్చోబెట్టండి. ఆమె కూడా మీలాగా అందంగా ఉండాలి మరి!”అన్నాడు సాగర్
“తీసుకొస్తాను, తీసుకొస్తాను. ఒక ముసలి అవ్వని తీసుకొచ్చి, నీ పక్కన కూర్చో పెడతాను ఉండు.
అనుకుంటు సౌమ్య  ఆ బస్సులో వున్న ముసలి భామ్మ లను అందరినీ అడగడం ప్రారంభించింది. “మీరు ఆ ప్లేస్లో కూర్చుంటారా బామ్మ! నేను కొంచెం ఇక్కడ కూర్చుంటాను” అని కానీ ఎవరు ప్లేస్ ఎక్స్చేంజికి ఒప్పుకోలేదు కదా! పైగా
“ఎవరమ్మా నువ్వు? మేము అసలే సెకండ్ హనీమూన్ కి వెళ్తుంటే.. మమ్మల్ని విడదిద్దామనుకుంటున్నావా! పోమ్మ పో అంటూ కసిరి పంపారు..” దానితో..సౌమ్య మళ్ళా వచ్చి సాగర్ పక్క.సీటు లోనే  దిగాలుగా కూర్చుంది.
బస్సులో వాళ్ళందరినీ అడిగి అడిగి అలసిపోయిన సౌమ్య, చిరాకుతో అయ్యో అంటు తల పై చేయి పట్టుకుని కూర్చోవడం వలన తన చీర చెంగు కొంచెం ప్రక్కకు జరికి ఆమె యదస్థానం
కొంచెం బహిర్గతముగా కనపడుచున్నది. అని గమనించుకోలేదు గాని, సాగర్ తన వైపే రెప్పార్ప కుండ, చూస్తున్న చూపులను మాత్రం ఇట్టే పసిగట్టేసి.
తనని తాను ఒకసారి చూసుకుని. ఏం జరిగిందో అర్థం అయినట్లు నాలుక కరుచుకొని. తన పవిట చెంగును సరిచేసుకుంది వెంటనే. అయినా కూడా.. సాగర్ సౌమ్యను అలాగే చూస్తూ ఉన్నాడు. సాగర్ చూపుల తాకిడికి కాస్త ఇబ్బందిగా అనిపించి. ఇంక లాభం లేదు అని, కాస్త ధైర్యాన్ని మూట కట్టుకొని.
“బాబు నీకు దండం పెడతా! కాస్త కళ్ళు మూసుకొని పడుకో.. నీ బుద్ధి నాకు ముందే తెలుసు, ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకే బుద్ధి బయట పెట్టుకోవాల్సిన అవసరంలేదు. అదే నీకు నాకు మంచిది.” అని, తను బస్సులో ఉన్న విషయాన్ని మరిచిపోయి కాస్త గట్టిగా కోపంగా చెప్పింది సాగర్ కు, సౌమ్య.
ఆ మాటలన్నీ వినబడిన సౌమ్య కూర్చున్న సీటుకు ఫ్రంట్ సీట్లో వున్న, తాత లెగిసి, సౌమ్యవైపు చూస్తూ “అమ్మ మనవరాలా..! కాస్త నిదానంగా మాట్లాడుకోండి తల్లి ..నిద్ర వస్తుంది. అసలే ముసలి ప్రాణులం కాస్త విశ్రాంతి లేకపోతే ఎలాగా?” అని సౌమ్యకు కాస్త సున్నితంగా చెప్పి కూర్చున్నాడు.
ఆ తాత అక్కడితో ఆగక, తన పక్కన కూర్చున్న తన భార్యతో “మాజీ ప్రేమికులు అనుకుంటా. ఇలా బస్సులో కలిసినట్లు ఉన్నారు.” అని చెప్పి, కళ్ళు మూసుకొని మళ్ళా నిద్రపోసాగాడు ఆ తాత..
తాత మాటలు విన్న సౌమ్య. ఇదిగో చూడు.. ఇదంతా నీ ములానే అంటు సాగర్ వైపు చూస్తూ మూతి తిప్పుకుంది.
సౌమ్య మాటలకు సాగర్ “హ చూస్తున్న చూస్తున్న..థాంక్యూ సౌమ్య ” అన్నాడు.
“ఏం చూస్తున్నావ్?”
“ఏం మాట్లాడుతున్నావ్?” అన్నది సౌమ్య ఏమీ అర్థం కాక.. “నువ్వే అన్నావుగా చూడు అని?”
అదే చూస్తున్న ఎంత తెర అడ్డుగా ఉన్నా..నీ సొగసులు, వంపు సొంపులు, నయగారాలు అన్ని కనబడుతూనే ఉన్నాయి. నీ వెంత దాచాలనుకున్న.. “అన్నాడు సాగర్. సాగర్ మాటలకు, సౌమ్యకు ఇంక నోట మాట రాక.
“బాబోయ్ నువ్వు ఇంక మాట్లాడకు, ఇంకో మాట మాట్లాడవా.. నీ నోరు కుట్టేస్తా అన్నది కాస్త కసురుగా.”
అంతే! ఎదుటి సీటులో ఉన్న తాత “అమ్మ మనవరాల..! నీకెన్ని సార్లు చెప్పాలి, కాస్త నిదానంగా మాట్లాడమ్మా..”అన్నాడు మరలా లెగిసి నిలబడి. సౌమ్య నాలుక కరుచుకుని, “సారీ తాతయ్య” అని చెప్పి. సాగర్ కు కొంచెం దగ్గరగా జరిగి సాగర్ చెవి దగ్గర “ఇంకోసారి ఇలా పిచ్చి మాటలు మాట్లాడావంటే.. నీ పని ఎలా చెప్పాలో.. అలా చెప్తా చూడు”. అని చిన్నపిల్లలా అంటూ  సాగర్ కాలును తన కాలితో గట్టిగా తొక్కింది. దానితో సాగర్ అబ్బా..ఏంటి సౌమ్య గారు ఇది అన్నాడు.
“హ మంచిది.. అయ్యిందా! అలాగే గట్టిగా ఇంకా గట్టిగా తొక్కుతా.. నీకు బాగా బాధ కలగాలి. బాగా నొప్పి పుట్టాలి. అన్నది సౌమ్య గర్వంగా.. నేను, అబ్బా.. అన్నది నా కాలు మీద మీరు తొక్కినందుకు కాదండి. మీ చెంప నాకు ఇంత దగ్గరగా ఉంటే ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. కాస్త పర్మిషన్ ఇస్తారా! సాగర్ మాటలకు సౌమ్య “ఏంటి?ముద్దు పెట్టుకుంటావా! నీ పని ఇలా కాదు అంటూ సాగర్ తొడపై తొడపాశం పెట్టింది ”
ఇంతలోపు హైవే పక్కన ఉన్న ఒక దాబా దగ్గర బస్సు ఆగింది. తన వెనకాలే నడుస్తూ..తనని ఏదో విధంగా అంటుకోవాలని ప్రయత్నిస్తున్న, తన వెనుక నడుస్తున్న సాగర్ వైపు చూసి, బస్సులో నుండి కిందకు దిగబోతున్న సౌమ్య, పొరపాటున కాలు స్లిప్పయి, పడిపోబోతుంటే .. పడిపోకుండా పట్టుకున్నాడు సాగర్. సౌమ్య, సాగర్ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు. కాదు పాత జ్ఞాపకాలను కళ్ళతోనే చెప్పుకుంటున్నారు. కానీ, అంతలోనే సాగర్ కు ఏదో గుర్తొచ్చినట్లుగా..నడుముని చుట్టేసి పట్టుకున్న చేతిని ఒక్క ఉదుటున వెనక్కి తీసుకొని. పడిపోకుండా రెండవ చేత్తో సౌమ్య ను పట్టుకొని, నిలకడగా నిలబడిన తర్వాత ఓకే నా సౌమ్య? ఏం కాలేదుగా? అని అడిగాడు సాగర్.
“చాలా అయింది సాగర్. కానీ, అది నేను చెప్పలేను అని మనసులోనే అనుకుని, బయటికి మాత్రం” ఒకే సాగర్ ఏం కాలేదులే అన్నది” సౌమ్య
బస్సు ఇప్పుడే కదలదంట, ఎడతెరపు లేని వర్షం కారణంగా..ఈ ప్రక్క ఊరిలో ఉన్న వంతెన  కూలిపోయింది. అని చెప్పారు బస్సు డ్రైవర్.
ఈరోజు రాత్రి అందరూ ఇక్కడే  వుంటే రేపు తెల్లవారిన తర్వాత వేరే రూట్ తీసుకుని వైజాగ్ వెళుతుందని, మాట్లాడుకుంటున్నారు బస్సు దిగిన మిగతా ప్రయాణికులు. ఇంకా గత్యంతరం లేని పరిస్థితులలో.. అందరూ ఆ దాబా దగ్గర ఉన్న ఒక చిన్న హోటల్లో ఆరోజు రాత్రి స్టే చేయడానికి సిద్ధమయ్యారు.
ఆ హోటల్లో రూమ్స్ తక్కువగా ఉండడం వలన సాగర్ సౌమ్య ఆ రోజు రాత్రికి ఒకే రూమ్ లో ఉండవలసి వచ్చింది.”అప్పటిదాక  కొట్టుకుంటూ తిట్టుకుంటు వున్న వాళ్ళిద్దరి మధ్య ఆ గదిలోకి వెళ్ళినది మొదలు నిశ్శబ్దమే అలుముకున్నది.”
చాలాసేపు ఇద్దరు  తలదించుకుని కూర్చుని ఉన్నారు. కాసేపటి తర్వాత మౌనాన్ని విచిన్నం చేస్తూ.. “సౌమ్య ఏమీ అనుకోమాకు, నాకు బాగా నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. నీవు కూడా నిద్రపో..”
ఆ బెడ్ మీద నీవు పడుకో, ఇక్కడ క్రింద నేను పడుకుంటాను అని చెప్పి, సౌమ్య సమాధానం కోసం ఎదురు చూడకుండ ఆ బెడ్ పైన ఉన్న ఒక బెడ్ షీట్ ని తీసుకుని క్రింద నేలపై పరుచుకుని పడుకున్నాడు సాగర్.
ప్రయాణం వలన వచ్చిన అలసట కారణంగా సౌమ్య కూడా బెడ్ పై నిద్రపోయింది. కాసేపటి తర్వాత, ఓ చల్లని చినుకు సౌమ్య బుగ్గని తాకగా మెలుకువ వచ్చి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది.
సాగర్ కళ్ళ వెంట కన్నీరు..సామ్య పడుకున్న..
సాగర్ మాత్రం సౌమ్య ప్రక్కనే కూర్చుని తననే చూస్తూ ఉన్నాడని సౌమ్యకు అర్థం అయింది.
“అయ్యో ఏడుస్తున్నావా? ఎందుకని ? ఇప్పుడు ఏమైందని? నీ లైఫ్ అంతా బాగుంది కదా! మంచి భార్య, ఇద్దరు పిల్లలు ఉండి ఉంటారు. ఇప్పటికి.
ఇంకేమీ, అప్పుడు ఏదో జరిగిపోయింది. దానికోసం ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏముంది చెప్పు.
ముద్దపప్పు” అనిఅంటూ రాని నవ్వును తెచ్చుకుని సౌమ్య నవ్వేసింది.
“హా..భార్య, ఇద్దరు బిడ్డలు నా బ్రతుకుకి అదొక్కటే తక్కువ, నేను నిన్ను ఎలా మర్చిపోతానే అందాల రాక్షసి, ఏదో మాయ చేసి పోయావు కదా! ఇప్పటికే ఆ మాయలోనే బ్రతుకుతున్నాను.” “సరే నా సంగతి ఎందుకులే గాని, మీ లైఫ్ ఎలావుంది సౌమ్య గారు హ్యాపీ యే కదా! అన్నట్లు మీ వారేమిచేస్తారు?” అని అడిగాడు సాగర్
సాగర్ మాటలకు సౌమ్య అమ్మో.. ఆపు..ఆపు నీ మాటలకు నాకు ఇంత వర్షం లో కూడా చెమటలు పట్టేసాయి. ఒక్క నిమిషం చెప్తాను, అంటు సౌమ్యతన పవిట కొంగుతో తన నుదుటిని తుడుచుకుంటూ ఉంది. ఆ సందర్భంలో ఆమె నడుము బాగాన ఉన్న పవిట కొంచెం ప్రక్కకు జరిగింది. కళ్ళు తిప్పుకోనివ్వకుండ వున్న ఆమె నాభి సౌందర్యాన్ని చూడకుండ ఉండలేకపోయాడు సాగర్.
సాగర్ ని, గమనించిన సౌమ్య, సాగర్ ముఖాన చిటిక వేసి, “అవును. ఏంటీ అడిగావు? ఇందాక. మా వారు ఏమి చేస్తారు అని కదా!” ఇదిగో నా ముందు నిలబడి ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తాడు అన్నది సౌమ్య గల గల నవ్వుతూ. సాగర్ అయోమయంగా! చూస్తు..”ఏంటి అర్థం కాలేదు”
అన్నాడు.
“ఇంకా అర్థం కాలేదా! ముద్దపప్పు. మింగేశేలా చూశావు బస్సులో” నా గుండెల పై నీకు తాళి కనబడిందా? కోపంతో కాలితోక్కానని అనుకున్నావు, కానీ కావాలనే తొక్కాను, నా కాలికి మెట్టెలు పెట్టుకున్నట్లు అనిపించిందా నీకు?” అంటూ వస్తున్న కళ్ళనీరును కనబడనీయకుండా..వెనుకకు తిరిగి కర్చీపుతో కళ్ళ నీరు తుడుచుకుంటుంది సౌమ్య.
“వాలు జడ, వయ్యారాల నడుము వంపు ఆ జడను తాకుతు కమనీయమయిన సొంపులు ”
కనుల ముందే ఉన్న, అవేమీ కనబడడం లేదు సాగర్ కు, “సౌమ్య కళ్లలో నిండిన కన్నీరు, ఇంకా తననే మనసులో నిలుపుకుని వున్న ఆమె హృదయం తప్ప” కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం తాండవమాడింది. అలా కొంత సమయం గడిచిన తర్వాత, ఆ మౌనాన్ని విచ్చినం చేస్తూ..  సౌమ్య సాగర్ కి దగ్గరగా వచ్చి. “నిన్ను కాకుండా మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావ్ ఇంకా అర్థం కాలేదా! ముద్దపప్పు అని అంది”
ఒక్క సారిగా సామ్యను గట్టిగా హాగ్ చేసుకుని, సాగర్ ఏడుస్తూ.. “సారీ రా లవ్ యు”అన్నాడు. సౌమ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని “లవ్ యు టూ” అన్నది సౌమ్య కూడ.. సాగర్ కళ్ళలోకి చూస్తూ.
ఇరువురు ఒకరయ్యారు ప్రేమ ముడి బలపరిచిన ఆ సమయాన..జీవితాంతం జత అయ్యారు, చావు తప్ప విడదీయని మూడుముళ్ల బంధంతో ఆ మరుసటి రోజు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!