ఏ దరికో

ఏ దరికో

రచన::విజయ మలవతు

ఊహించని మలుపులతో
సాగే జీవనపయనంలో
ఎన్ని అవాంతరాలో
ఎన్నెన్ని అడ్డంకులో..

అనుకోనిది జరగటమే జీవితం
సాధించటం తెలిసినంతనే
కోల్పోవుట కూడా తెలియునే
ఎవరు ఎవరికి శాశ్వతం కాదుగా..

మనచేతిలోన ఏమున్నది..
వెళ్లాలనుకున్న వారికి
వీడుకోలు పలుకుతూ
రావాలనుకున్న వారిని స్వాగతిస్తూ..

తలుపుల దగ్గరగా ఉన్నా
తలపులలో నివసించే వారికైనా
ఏదోక మర్యాద చేస్తూ
స్వగతంలో జీవిస్తూ..

బాధకు క్రుంగుతూ
సంతోషానికి పొంగుతూ
ఏ దరికో తెలియని
అనంత విశ్వంలో జీవన గమనం..!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!