ఇది వాస్తవం

ఇది వాస్తవం

రచన :: జీ వీ నాయుడు

ఇది వాస్తవం
వినాలంటే కొంత కఠోరం

కరవవుతున్నాయి బంధాలు
కఠినమౌతున్నాయి సంబంధాలు
కలుస్తున్నాయి అక్రమ సంబంధాలు

ఏ ఇంట్లో చూచినా
ఏదో ఒక గోళో గోడవో

చీటికి మాటికీ చిర్రు బుర్రులు
సహనం సుదూరాలు
పరిస్కారం పలాయణం

పట్టింపుల బ్రహ్మ రధం
పడక గదులు నిర్మానుష్యం
పోతున్నాయి పరువులు

ఆగనంటున్నాయి అరుపులు
తెగనంటున్నాయి తీర్పులు
విడవనంటున్నాయి పంతాలు
వదలనంటున్నాయి వదంతులు

బెదిరింపు ఆత్మ హత్యలు
బరిదెగింపు హత్యలు

క్షణికావేషాలు
చివరకు వినాశకాలు
స్థిరమౌతున్న విడాకులు..

ఇదండీ నేటి లోకం తీరు
ఎవరవునన్నా కాదన్నా
జగమంతా జోగుతుంది
ఆక్రమణల అక్రమాల ఊబిలో

నూటికో కోటికో కొందరు
అనిగీమనిగి అవుతున్నారు
ఆదర్శ దంపతులు అరుదుగా…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!