కొలిమిలోపడ్డ శలభంలా

(అంశం:”అగమ్యగోచరం”)  

కొలిమిలోపడ్డ శలభంలా

రచన :: వాడపర్తి వెంకటరమణ

నా కలలను పండించుకోడానికి
అహర్నిశలు అలుపెరగక
కొన్ని ఆశల విత్తులు చల్లుకుని
భవిష్యత్తు పునాది వేసుకోడానికి
చంద్రుని కోసం చకోరంలా
ఎడతెగక ఎదురుచూస్తున్నాను

మొన్న కురిసిన విషపు చినుకులకు
పచ్చగా విరబూయాల్సిన వనం
మోడిబారి కళావిహీనంగా మారింది

కొలువులేని భవితవ్యమిప్పుడు
కొలిమిలోపడ్డ శలభమయ్యింది
రంగులు వెలసిన నా ఆశల హరివిల్లు
అగమ్యగోచరంగా ఎటో చూస్తోంది!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!