మది చేసే గారడి

మది చేసే గారడి

రచన: మక్కువ. అరుణకుమారి

నింగి నుండి జాలువారే చినుకుపూల దారాలు చూసి
ఆకాశాన్నందుకునేందుకు నేలమ్మ మదిచేసే గారడి

గిరి శిఖరాలపై జాలువారుతూ
గలగలల పరవళ్ళతో
సాగరసంగమానికి ఉరకలు వేస్తూ పరుగులు తీసే
నదీకన్యకల మది చేసే గారడి

మంచుతెరలను చీల్చుకుంటూ
వెలుగు రేఖలు పంచుకుంటూ
ప్రభాతకిరణాలు సోకగానే
కమలభామల మది చేసే గారడి

చంద్రోదయాన కురిసే శశికిరణాల తాకిడితో
ఉల్లముల ఉప్పొంగిన పుప్పొడుల మరందాలతో
కలువభామల మది చేసే గారడి

మనోవీధిన ఎగిసే భావసంచలనాల అక్షరమాలికల
ముత్యాలసరములను గుదిగుచ్చుతూ నామదిచేసే గారడి
ఏ యదసడులను చేరాలనో!
చేరిందో ,లేదోననో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!