మనిషి జీవనం

మనిషి జీవనం

రచన: శృంగవరపు శాంతికుమారి

అన్ని జీవులుకన్నా గొప్ప జీవని పేరుకే
మిగతా ఏ జీవులకు లేని
ఒత్తిడి, భయం, అంతస్సంఘర్షణ !
ఈ క్షణమే సంతోషం మరో క్షణంలో విషాదం
ఏది తింటే ఆరోగ్యమో ఏది తింటే అనారోగ్యమో
విషమేదో అమృతమేదో
మేలు చేసేవారు ఎవరో
హాని చేసేవారు ఎవరో
ఎక్కువ మాట్లాడినా తప్పే
తక్కువ మాట్లాడినా తప్పే
విచక్షణ కోల్పోయి
నైతిక విలువలు మర్చిపోయి
వేష భాషలను మార్చేసి
సంస్కృతి సంప్రదాయాలను భ్రష్టు పట్టించి
చెడు అలవాట్లకులోనై
ఎటు చూసినా అసంతృప్తే
సంఘజీవని మాటే
కాని సంఘీభావం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది
కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నా….
ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నా….
నాగరికతాభివృద్ధి అంతకంతకు పెరుగుతున్నా….
మూఢ నమ్మకాలు
అంధవిశ్వాసాలు !
నడయాడే దేవతలు స్త్రీలు
శక్తి స్వరూపులు
అబలు కాదు సబలు
సృష్టికి మూలం
మహిళలను ఆదరించడం కన్నా
అణచివేయడమే ఎక్కువ!
మనుషులంతా ఒక్కటే
దేవుడంతా ఒక్కడే అన్న సూక్తులే
నీ నా అని దేవుడ్నే వేరు చేయడం
ధనిక పేద తారతమ్యం
కులమత భేదం
హత్యలు అరాచకాలు!
గగుర్భాటు పుట్టించే వింత వింత సంఘటనలు
జుగుప్స కలిగించే వికృత చేష్టలు
వీటన్నిటి మధ్య మనిషి జీవనం
ఏ ముంది గొప్పతనం !

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!