మా దీవెనలు

మా దీవెనలు

రచన: మంగు కృష్ణకుమారి

యంత్రం వెళ్లలేని మూలలకి నే
వెళతా! మంత్రమో, తంత్రమో నా కాలి గిట్టలే!
పొద్దు కెదురుగా నా కొమ్మూ!
పొద్దంతా ఆగని నా సేవలు నిజమే సుమ్మూ!
మీ గాదెలూ పిల్లల బొజ్జలూ, నిండి, కళకళలాడుతూ మీరు ఉండాలన్నదే
నా కోరికా…. నాకష్టం కూడా అందుకే
ఆరగించడంతో ఆగుతారా మానవులారా!
ఆలోచనలకి బలం చేకూరేసరికి అణువునే విడగొట్టేస్తారే!
మీ కన్నవారిని పెరటి గదిలో మమ్మలని కబేలాలో!
ఇదేగా అంతిమంగా దొరికేది!

మగవాడి పితృహృదయం కూడా
బిడ్డల ఉన్నతినే కోరుకుంటుంది
మూలగదిలోంచీ మీ తల్లితండ్రులు
కబేలాలో మేమూ మిమ్మలని దీవిస్తూనే ఉంటాం!

భూమీ, ఆకలీ అజరామరం!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!