నాన్న
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
నేను పుట్టీ పుట్టగానే మార్చుకున్నారు
నీ ప్రపంచాన్ని
గడియారంలోని సెకెండు ముల్లులా కష్టపడుతూ,
కావాల్సినవన్ని అందిస్తూ మా నవ్వును చూసి మరిచారు పడ్డ కష్టాన్ని ,
మా రేపటి కోసం మీ ఆలోచనలన్నీ,
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏనాడూ చేసుకోలేదు చెయ్యిని,
అది చేయి, ఇది చెయ్యని వారిస్తూ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు మా ఇష్టానికి,
తప్పు చేసిన ప్రతిసారీ మంచి చెబుతూ
ఓడిపొయిన ప్రతిసారీ
ప్రేరణ ఇస్తూ నడిపించావు ముందుకి ,
బంగారంలాంటి నీ పెంపకంలో పోలేదు
ఏ దురలవాట్లకి,
సోమరితనమో లేక ఏం చేసిన ఏమనరిని గర్వమో తెలీదు కాని,
అయ్యాను సరస్వతి హీనుడిని,
వృధా చేశాను కాలాన్ని,
కష్టంలో సుఖమివ్వాల్సిన వాడిని ,
రెక్కలు వంగిపోయే స్థితికి వచ్చినా పోషిస్తున్నావు
నన్ను మీ మనవడినని,
ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ
చచ్చి బ్రతుకుతూ
జీవచ్ఛవంలా వెళ్ళదీస్తున్నా కాలాన్ని.