నేనెమన్నానని?

నేనెమన్నానని?

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

“మనకెందుకు వాళ్ళ గొడవ మనం చెబితే వింటారా ఏమైనానా! వచ్చామా! వాళ్ళు పెట్టినది తిన్నామా! రమ్మంటే వాళ్ళతో బాటే మనము తిరగడానికి వెళతాము. ఇద్దరు ఉద్యోగస్థులు. శని ఆది వారాలలో పిల్లలని బయటకు తీసుకెళ్తారు. మనం వస్తున్నామని ఎనిమిది సీటర్ బండి తీసుకున్నారు. ఇక్కడ కూడా మీరు మన ఊళ్ళో ఉన్నట్లే ఉండాలంటే ఎలా? దేశం కానీ దేశంలో ఉన్నారు. ఐదేళ్ళయి రమ్మంటే. ఒరే.. రిటైర్ అయ్యాక వస్తామని అంటే అలాగే అన్నాడు. ఒక్కగా నొక్క కొడుకు ప్రకాశం. మనమాట విని పెళ్ళి మీ విజయవాడ అక్క కూతురు ప్రమీలను కాదనక చేసుకున్నాడు. నిక్షేపంగా ఇద్దరు పిల్లల్ని కని లంకంత ఇల్లు కట్టుకుని మనల్ని రమ్మంటే మీరు ఇలా ప్రవర్తించడం బాగాలేదు అని ఉపన్యాసం ఇస్తున్న భార్య సుభద్రమ్మతో అలాగేలే అన్నారు. ఈ మధ్యనే ముప్పైఎనిమిదిఏళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పూర్ణయ్య పంతులు గారు. వెంటనే తయారవండి. అబ్బాయి, కోడలు, మనుమలతో కలసి వెళదాం అన్నారు సుభద్రమ్మ గారు.”
పూర్ణయ్య గారు ముప్పైఎనిమిది సంవత్సరాలు ఆదర్శ ఉపాధ్యాయునిగా పనిచేసారు. అందరు మా ఊరి గాంధీ అని పిలుస్తారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాలలో ఉన్నత పదవులు చేస్తున్నారు. కొడుకు ప్రకాశం “ఈ శని, ఆదివారాల ముందు సెలవులు కలసి వస్తున్నాయి. నాకు, మా ఆవిడకు పిల్లలతో సహా చికాగో వెళదాం. ఇక్కడ అందరు కారులోనే వెళతారు. మీ కోసమే ఎనిమిది సీటర్ బండి తీసుకున్నాను”. అంటే “ఒరే ప్రకాశం ఇవి వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు పూజ, పునస్కారాలు ఉంటాయి. ఇప్పుడు రాలేను అన్నానంతే. వెంటనే ప్రకాశం మరి రెండునెలలు మాకు పని ఒత్తిడి పిల్లల పరీక్షలు దేముడు ఎక్కడ లేడు నాన్నగారు వెళదాం అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళాడు.” ‘ఇది విన్న నాతో నలభై ఏళ్ళయి కాపురం చేస్తు రోజు మడి, తడి అనే మా ఆవిడ మాటలకు విస్తుపోవడం నా వంతై నేనేమన్నాని మనసులోనే కొడుకు కాపురం చూసిన సంబరం. ఏమైనా మాతృహృదయం అనుకున్నారు పూర్ణయ్యగారు.’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!