నేత్రదానం(సంక్రాంతి కథల పోటీ)

నేత్రదానం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: ఎన్.ధన లక్ష్మి

తల్లి దండ్రులు బిడ్డని తమ సంరక్షణలో ఎప్పుడు భద్రంగా ఉంచుకుంటారు. కానీ ఓ జంట తమ బిడ్డకు ఉన్న లోపాన్ని చూసి అనాధగా వదిలేసి వెళ్ళారు. తల్లిదండ్రులు ఉన్న అనాధ గా ఆశ్రమాల్లో ఉండవలసిన దుస్థితి వచ్చింది. తన లోపాన్ని జయించి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించిన ఓ డాక్టర్ కథ….

@@@@@@@@@@@@@@@@@@

రైల్వే స్టేషన్ దగ్గర ” అమ్మ కావాలి” అని గుక్క పెట్టుకొని ఏడుస్తున్న మూడేళ్ళ పాపను చూసిన ఆటో డ్రైవర్ తనని తీసుకోని వెళ్ళి పోలీస్ లకు అప్పగించాడు..
పాప ఎంత సేపు అమ్మ కావాలని ఏడుస్తుంది తప్ప తన వివరాలు ఏది చెప్పలేకపోతోంది.. తన ఫోటోలను తీసి అన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అన్నిట్లో వాల్ పోస్టర్ అంటించారు. ఆ పాపని అనాధాశ్రమంలో చేర్చారు..
సరిగ్గా వారానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ పోలీసులకు ఫోన్ చేసి “కొద్ది రోజులు క్రితం కూలి పనులు చేసుకునే భార్య భర్తలు ఫోటో లో ఉన్న పాపను తన వద్దకు తీసుకు వచ్చారని పాపకు జన్యు లోపం వల్ల కొద్దీ రోజుల్లో తను చూపు కోల్పోతుందని చెప్పాను అని, పాప కు సరిపోయే కళ్ళు దొరికిన వెంటనే ఆపరేషన్ చేస్తే తనకి చూపు వస్తుందని దానికి కొంత మేర డబ్బు అవసరం అవుతుందని చెప్పాను అని వాళ్ళు ఏమి చెప్పకుండా పాపను తీసుకొని వెళ్ళి పోయారని డాక్టర్ చెప్పారు
కావాలనే తల్లిదండ్రులు పాపను రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళారని పోలీసులకు అర్థమైంది..
ఆశ్రమము వాళ్ళే పాపకు నయన అని పేరు పెట్టారు..పాపకు ఐదు ఏళ్ళు రాగనే పూర్తిగా చూపును కోల్పోయింది..
నయనకు కళ్ళు లేవు అనే లోపం తప్ప మిగతా అన్నిట్లో చురుగ్గా ఉండేది చక్కగా చదువుకునేది..
దత్తత తీసుకోవడానికి అక్కడికొచ్చే వాళ్ళు మొదట నయనను చూసి ముచ్చట పడ్డ తనుకు ఉన్న లోపాన్ని చూసి తీసుకోకుండా వెళ్ళిపోయేవారు..
తనని ఎవరు ఇష్టపడడం లేదని తెలుసుకొని ఏడుస్తూ కన్నీరుమున్నీరైంది ఓ రోజు…అది చూసిన ఆశ్రమం వార్డెన్ నయనను ప్రేమగా దగ్గర తీసుకొని తన కన్నీరును తుడిచి” నీకు మంచి రోజులు వస్తాయి అమ్మ…నీతో పాటు నీ లోపాన్ని ఇష్టపడి, నీకు ఆపరేషన్ చేయించి ,ప్రేమను పంచే వాళ్ళు వస్తారు అంతవరకు నువ్వు ఓపికగా ఉండాలని ధైర్యం చెప్పారు ”
నేత్ర,ఆనంద్ ముచ్చటైన జంట. వారి పెళ్ళి అయిన ఏడాదికి తమ వారినందరిని ఒక్కసారిగా ఓ ప్రమాదంలో కోల్పోయారు..ఇద్దరు అమ్మ,నాన్న ప్రేమలను కోల్పోయి బాధ పడ్డారు..అందుకే వాళ్ళిద్దరూ అమ్మ,నాన్న ప్రేమ కోసం తపించే వారిని దత్తత తీసుకోవాలని అనుకున్నారు..
అలా నయన ఉన్న ఆశ్రమానికి వచ్చారు…
ఆనంద్ కి ఫోన్ రావడంతో మాట్లాడుతుంటాడు.
ఆశ్రమం మొత్తం ఎంతో అందంగా , పచ్చదనంతో నిండిపోయింది..అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తూ నేత్ర రాయి తగిలి కింద పడిపోతుంది..అమ్మ అంటుంది నొప్పితో అక్కడే కూర్చోని ఉన్న నయన లేచి ” అమ్మ దెబ్బ తగిలిందా ,తగ్గిపోతుంది ..ఏమి కాదు అంటుంది..”
నేత్రకు నయనలో వాళ్ళమ్మ కనపడుతుంది …
తనని హత్తుకొని తనివితీరా ఏడుస్తుంది…ప్రేమగా నుదిటి మీద ముద్దు పెడుతుంది..
నయనకు ఏమి అర్ధం కాకపోయినా సైలెంట్ గా ఉంటుంది….
అక్కడికి వచ్చిన ఆనంద్ తో ” ఏవండీ ఈ పాప నేటి నుంచి మన పాప..కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి ”
“నేత్ర మనం నెలల పాపను తీసుకొని వెళ్దాము అనుకున్నాము కదా!..అప్పుడే మనకు బాగా దగ్గర అవుతుంది అనుకున్నవు కదా! ”
“నిజమే నందు…ఈ పాప నన్ను అమ్మ అంది..
నాకు ఈ అమ్మాయీ నచ్చింది..”
అవునా నీ ఇష్టమే నా ఇష్టము ఈ పాప పేరు ఏంటి”
“నీ పేరు ఏంటి కన్న”
“అమ్మ! నా పేరు నయన.నాకు కళ్ళు కనపడవు..
సర్ గారు చెప్పినట్టు లోపలన్న చిన్నారిని తీసుకొని వెళ్ళండి…అక్కడ ఆ వార్డ్నెన్ మేడమ్ ఉంటారు అని సమాధానం చెపుతుంది..”
“నయన సర్ కాదు నాన్న అని పిలువు తను కూడా ప్రేమగా హత్తుకున్నాడు ”
“అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు..ఆనాటి నుండి పాపను వారి పాప లాగ కంటికిరెప్పలా చూసుకున్నారు…నయన రాకతో వారి ఇల్లు ఆనందమయం అయింది.. ఎప్పటి నుండో కోర్టులో ఉన్న వారి పూర్వీకుల అస్తి కూడా వారి చేతికి వచ్చింది..నయనను వారి ఇంటి మహాలక్ష్మి గా భావించారు ”
“ఓ పెద్ద కంటి డాక్టర్ కి నయననీ చూపించారు..ఆ డాక్టర్ గారు మొదట ఒక కంటికి ఆపరేషన్ చేద్దాం తరువాత ఇంకో కంటికి అని చెప్పారు .. అలా నయనుకు ఒక కంటికి చూపు వచ్చింది.. చుట్టున్నా ప్రకృతిని చూసి ఎంతో సంబరపడింది…
“తన అమ్మ, నాన్నలు చూపించే ప్రేమను చూసి ఇన్నాళ్ళు తను పడ్డ మనోవేదనను మర్చిపోయింది ..
కొద్దీ రోజులకీ నేత్రకి పండటి బాబు పుట్టారు..
నయన తన తమ్ముడిని ఎంతో బాగా చూసుకునేది. బాబుకి విహస్ అని పేరు పెట్టుకున్నారు..
కొన్నాళ్ళుకు నయన ఇంకో కంటికి ఆపరేషన్ చేశారు..నయన ఆనందం చూసిన నేత్ర,ఆనంద్ లు ఇద్దరు ఎంతో మురిసిపోయారు..ఒకరికి కంటి చూపు వస్తే ఇంత సంతోషంగా ఉంటుంది..తమ తదనంతరం కళ్ళను దానం చేయాలని భావించి ఓ హాస్పిటల్లో ఆర్గాన్స్ డోనార్ నమోదు చేసుకున్నారు…
ఆ ఏడాది పదో తరగతి ఫలితాల్లో తను జిల్లా ఫస్ట్ వచ్చింది..ఆనంద్ అయితే వీధి అంతా స్వీట్స్ పంచారు..
“నయనను ఏమి కావలని అనుకుంటున్నావు నువ్వు అడిగారు ఓ రోజు ఆనంద్!”
“నేను డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలని అనుకుంటున్నా నాన్న ..ఒకరి బాధను మనం తగ్గిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది…నన్నే చూడండి
నాకున్న లోపాన్ని దూరం చేసింది డాక్టర్ కదా!అందుకే నేను కంటి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్న అని చెప్పింది”
“శభాష్!మంచి నిర్ణయం అని అభినందించాడు”
“నయన ఇంటర్ లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది మెడికల్ లో ఫ్రీ సీట్ సంపాదించింది నాలుగేళ్లు కష్టపడి చదివి కాదు కాదు ఇష్టపడి చదివి డాక్టర్ పట్టాను అందుకుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.. పీజీ చదువుతుంది..తమ్ముడు బీబీఎం చదువుతుంటాడు.
“అమ్మ! ఈ పుట్టినరోజు కి ఏం గిఫ్ట్ కావాలి”
“నేను అనాధ పిల్లలకు , వృద్ధుల కోసం ఆశ్రమం నడపాలి అనుకుంటున్నా.. మీరు ఏమంటారు నాన్న!
అదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ నాన్న ”
“తప్పకుండా నడుపు తల్లి! మనకు దేవుడి దయ వల్ల డబ్బుకి లోటు లేదు.. నీకు నచ్చింది చేయి”
“నయన ఆశ్రమాన్నికి “నేత్రాలయం”అని వాళ్ళమ్మ పేరు పెట్టింది”
నేత్ర మురిసిపోతూ ,ఏడుస్తుంటే విహస్
“అక్క ఇంకాసేపట్లో ఇక్కడ వరద నీరు వచ్చేస్తుంది.. మనం మునిగిపోయేలా ఉన్నాము..”
“రేయ్! ఇక్కడ దగ్గర్లో కూడా చెరువులు లేవు,పైగా వానలు లేకుండా నీకు వరదలు ఎలా వస్తాయి రా ”
“నాన్న అమ్మ కన్నీటి సంద్రంలో మనం మునిగి పోయే లా ఉన్నాము”
“రేయ్ ఇది బాధలో వచ్చిన కన్నీరు కాదురా సంతోషంలో వచ్చిన ఆనందభాష్పాలు!నీకు అర్థం కాదులే !”
“అమ్మ నేను సరదాగా అన్నాను మనము సంతోషపడాలి బాధపడకూడదు అక్క ఇంత గొప్ప పని చేస్తున్నందుకు”.. అని విహస్ గర్వంగా చెప్పాడు
ఒక్కరిగా మొదలైన నేత్రాలయం లో దాదాపు 500 మంది ఉన్నారు. వాళ్ళ సంరక్షణ నయన కుటుంబం మొత్తం చూసుకుంటుంది.
నయన కొంతమందిని గ్రూప్ గా ఫామ్ చేసి వీకెండ్స్ లో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ ఉంది…
నయన పి.జీ లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది..
నయన కోసం హాస్పిటల్ కట్టించారు. నయన ఆ హాస్పిటల్ కు “నేత్రానంద్” అని పేరు పెట్టించింది..
నామమాత్రపు డబ్బులు తీసుకుంటు మెరుగైన వైద్యం చేస్తూ మంచి డాక్టరుగా పేరు తెచ్చుకుంది.. ఎంతో మందికి కంటిచూపు ని ప్రసాదించింది తన వైద్యంతో నయన.
ప్రతి ఆదివారం నయన,తన టీం వాళ్ళు తన నడుపుతున్న నేత్రాలయంకు వెళ్ళి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది..
నయన పట్ల ఒకామె చాలా ప్రేమ గా తన వైపు చూస్తూ ఉంటుంది.ఆమె భర్తను పరీక్షించి మందులు ఇచ్చి ఐ డ్రాప్స్ ఇస్తుంది…వీటిని వాడు పెద్దయ్య మీ కంటి సమస్య తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది
నయన వెళ్ళిపోయాక ఆమె ఏవండీ
“చూసారా! ఏ లోపం చూసి మన బిడ్డను అనాథలా వదిలేసి వచ్చామో ..ఇప్పుడు మనం తన సంరక్షణలోనే ఉన్నాము. తనే చాలా మందిని చూసుకుంటూ వారికి కొత్త జీవితాన్ని ఇస్తు అందరి ఆశీస్సులు అందుకుంటుంది మన బిడ్డ”
“ఏమి! అంటున్నావు? తను మన బిడ్డ అని నీకు ఎలా తెలుసు?”
“తన చేతిపై ఉన్న పుట్టుమచ్చను చూసి తను మన “నందన” అని అర్థం అయింది”
“అయితే తనను పిలువు మనమే తన అమ్మ నాన్న అని చెప్పుదాము”
“చిన్న పిల్లగా ఉన్నప్పుడు అనాధగా వదిలేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు తను మంచి పొజిషన్ లో ఉన్నపుడు మనం కలిసి తల్లిదండ్రులు అని చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. మనం చేసిన ద్రోహానికి ఇదే మనకి తగిన శిక్ష! కన్నబిడ్డనే ఎదురుగా పెట్టుకొని తన చేత అమ్మ నాన్న పిలిపించు కోకుండా ఉండడం..”
“నువ్వు చెప్పింది నిజమే ఆడబిడ్డ పైగా చూపులేదని ఇల్వదిలేసి వచ్చాము.. మగబిడ్డ కదా అని గారాబంగా పెంచితే వాడు మనల్ని భారం అనుకొని ఇంట్లో నుంచి తరిమేశాడు.. దేవుడు మనకి తగిన శిక్ష వేశారులే.
చూశావా విచిత్రం తల్లిదండ్రుల సంరక్షణలో బిడ్డలు ఉంటారు కానీ ఇక్కడ మన బిడ్డ సంరక్షణలో మనం ఉన్నాము.. తమ పరిస్థితి తలుచుకుని బాధ పడ్డారు
ఒక అబ్బాయి బైక్ నడుపుతూ యాక్సిడెంట్ లో చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఒప్పించి తన అబ్బాయీ కళ్ళను ఇంకో అబ్బాయి కి పెట్టింది నయన..
అబ్బాయిని చూసిన ప్రతిసారి తమ బిడ్డ బ్రతికే ఉన్నాడు అని అనుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు.
నయన అభ్యుదయ భావాలు నచ్చిన తన కాలేజ్ సీనియర్ వివేక్ తనను ఇష్టపడ్డాడు.. తన అమ్మా నాన్న తో వచ్చి నేత్ర ఆనంద్ లను ఒప్పించి నయనను వివాహమాడారు..
విహస్ తన చదువును కంప్లీట్ చేసి తండ్రి ఆనంద్ కి చేదోడువాదోడుగా ఉన్నారు..
నేత్రాలయంని నేత్ర చూసుకుంటూ ఉంటుంది…
నయన అటు డాక్టర్ గా,ఇటు గృహిణిగా , నేత్రాలయంకి అప్పుడప్పుడు వస్తూ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది.

**********************

You May Also Like

One thought on “నేత్రదానం(సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!