నీ నేను

ఒకసారి నీలాకాశంలో చందమామలా..

మరొకసారి అద్దంలో నెలరాజులా…

ఒకసారి దగ్గరగా..

మరొకసారి దూరంగా..

ఒకసారి ప్రేమగా …

మరొకసారి కోపంగా…

ఇలా అంది అందని జాబిల్లి లా…

ఎంత కాలం  ఈ దోబూచులాట ప్రాణబంధమా…

మరి నాకేమో  అనుక్షణం నీతో ఉండాలని…

నిన్ను చూస్తూ, నను నేను మర్చిపోవాలని…

చేజార్చుకున్న నా ఆశని, శ్వాస ను…

కలలుగా మార్చుకుని, ఆ కలలోనే..

నా కౌగిలి కోటలో నిను ప్రతిష్టించి…

నిను ప్రేమిస్తూ, ఆరాధిస్తూ…

నీ ధ్యాస లో ..

నీ కలల పూతోటలో…

కృష్ణుడు కోసం రాధలా….

నీ ప్రేమ కోసం తపించే  నీ నేనులా

ఇలా  ఉండిపోతా నా తుదిశ్వాస వరకు….

                                                                                                                                                     జయ

You May Also Like

2 thoughts on “నీ నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!