నిరీక్షణ

నిరీక్షణ

రచయిత:వి.కృష్ణవేణి

ఉదయించే భానుడికిరణాలు తగలగానే
పుడమి పులకరించినట్లు
మండువేసవిలో తొలకరి జల్లులా
కడలితీరన్న ఊహించని అలలా
మేఘంనుండి చిరుజల్లు కురిచినట్లు
నింగిని విడిచిన తారవోలె
వేకువలేని పయనంలో వెన్నెలవలే వచ్చి
మదిలో భావాలను ఏవో కల్పించి
దుఃఖం అనే సాగరం లో నింపేసి వెళ్ళిపోతే
కదిలే ప్రతిక్షణం వెంటాడే జ్ఞాపకాలలో
ఉండిపోయి
దూరమయినా క్షణాలు
జ్ఞాపకాల  దొంతరలతో
చీకటి కోరలలో కురుక్కుపోయి
జన్మజన్మలకి వీడిపోని వీడలేని బందమా
ప్రపంచమంతా చుట్టూ ఉన్నా నీ
తోడులేని జీవితం ఒంటరినై..
ఎన్ని  యుగాలయినా
నిరీక్షణలజ్ఞాపకాలలో
దూరమయినా క్షణాలు
అడవి గాచిన వెన్నెల వలె జీవితం ఒంటరేగా….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!