(అంశం:” ప్రమాదం”)
ప్రమాద ఘంటికలు
రచన:: దొడ్డపనేని శ్రీ విద్య
జీవితంలో అతి వేగం
ఎప్పుడూ ప్రమాదమే
హద్దు లేని
నోటి మాట
ఎంతో ప్రమాదం
నిర్లక్ష్యం మాటున
విలువయిన కాలాన్ని
జారవిడిచిన ప్రమాదమే
మత్తు వలలో
చిదిమేస్తున్న వ్యసనం
మరీ మరీ ప్రమాదం
అతి స్వేచ్చ
కోరుకునే వారికి
ఎప్పుడైనా ప్రమాదమే
నియంత్రణ లేని
అతి సర్వత్రా
ప్రమాదకరమే సుమీ !