సమ సమాజ వెలుగులు

అంశం: చీకటి వెలుగులు

సమ సమాజ వెలుగులు

రచన: నాగ రమేష్ మట్టపర్తి

కుల, మత, వర్ణ, వర్గ విభేదాల నడుమ
స్వార్థంతో నిరంతరం కొట్టుకు చస్తూ
కేవలం తమవారి ఉన్నతే ధ్యేయంగా
మిగిలిన వారి అణచివేేతే లక్ష్యంగా
సదా స్వవర్గ మేలు కోసం జీవించే వారికి
అందరినీ సృష్టించిన
ఆ విధాత ఒక్కడేనని
ఆయన సృష్టిలో ప్రతి ఒక్కరూ
తన సంతానమేనని
అందరూ సమమేనని
అందరి శరీరంలోనూ ఒకే నెత్తురని
ఒకే కులం, ఒకే మతంలోని వ్యక్తులకు కూడా
ఒకే రకమైన రక్త సమూహాలు ఉండవని
వివేకంతో, విజ్ఞతతో వివరిస్తూ
కుల, మత, వర్ణ, వర్గ విభేదాలనే
అజ్ఞానపు  ” చీకట్లు ”  తొలగించి
సోదరత్వం,సమానత్వం, సౌభ్రాతృత్వమనే
మానవత్వపు  ” వెలుగులు ”  నింపుదాం….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!